హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): పబ్లిక్ హెల్త్ డాక్టర్లకు ప్రత్యేక బదిలీలు కల్పించినందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
బుధవారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఇన్ సర్వీసు కోటాలో మిగిలిన సీట్లకు మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ వైద్యుల ప్రతీ సమస్యను పరిషరించిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కత్తి జనార్దన్ తెలిపారు.