హైదరాబాద్: లేడీస్ టాయిలెట్లో సెల్‌ఫోన్‌తో రహస్యంగా చిత్రీకరించిన ఘటన జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్-10లో ఓ రెస్టారెంట్లో జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ యువతి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసులు రెస్టారెంట్‌కు చేరుకుని బాత్రూంలో పెట్టిన సెల్‌ఫోన్ కెమెరాను పరిశీలించారు.
కాగా ఆ ఫోన్ నిన్నటి నుంచి ఆన్‌లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాత్రూం క్లీనర్ బెనర్జీ ఫోన్‌ను అమర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈ ఘటనకు కారకుడైన బెనర్జీని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఫోన్‌ను పెట్టినట్లు ఒప్పుకున్నాడు. కాగా అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.