గాంధీ ఆస్పత్రిలోనూ ‘కాటరాక్ట్’ సర్జరీలు
హైదరాబాద్ : కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక సౌకార్యలను ఏర్పాటు చేసినట్లు ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. కంటి సమస్యలున్నవారు చికిత్స కోసం గాంధీకి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా హాస్పిటల్లో ఉన్న ఆప్తమాలజి విభాగంలో ఆపరేషన్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాన్‌కోవిడ్ సేవలు పున:ప్రారంభమైన క్రమంలో కంటి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ‘కాటరాక్ట్’ సర్జరీలను అంటే కంటిలో ఏర్పడిన శుక్లాలను తొలగించే ఆపరేషన్లను ప్రారంభించినట్లు డాక్టర్ రాజారావు వెల్లడించారు.
ఇందుకోసం మూడవ అంతస్తులో ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్‌తో పాటు 20 పడకలను కంటి రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆప్తమాలజి విభాగం ఆధ్వర్యంలో ఇక నుంచి కంటి సమస్యలకు సంబంధించి ఓపి సేవలతో పాటు శస్త్రచికిత్సలను సైతం నిర్వహిస్తామని ఆప్తమాలజి విభాగాధిపతి డాక్టర్ రవిశేఖర్‌తో కలిసి డాక్టర్ రాజారావు బుధవారం మీడియాకు వెల్లడించారు. కంటి సమస్యలు, శుక్లాల సమస్యలు ఉన్నవారు గాంధీ దవాఖాన ఆప్తమాలజి విభాగాన్ని ఆశ్రయించాల్సిందిగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

