హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తేతెలంగాణ) : దేశంలో కులవ్యవస్థ అంతమైతేనే అమెరికా, చైనా మాదిరిగా మన దేశం సూపర్‌పవర్‌గా ఎదగడం సాధ్యమవుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యు డు బీవీ రాఘవులు పేర్కొన్నారు. దేశాభివృద్ధికి, విప్లవోద్యమానికి కులమే ప్రధాన ఆటంకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలు ఐక్యం కాకుండా అదే నిలువునా చీల్చుతున్నదని, పాలకులు కూడా దానినే కోరుకుంటున్నారని విమర్శించారు.
పెమన దేశంలో బలంగా పాతుకుపోయిన కులవ్యవస్థ పోవాలంటే కుల వ్యతిరేక, ఆర్థిక పోరాటాలు జమిలిగా సాగాలని, ఆ దిశగా కలుసొచ్చే శక్తులు ఏకంకావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో శుక్రవారం సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సభ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టీ జ్యోతి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ‘కుల నిర్మూలన-మార్సిస్టు దృక్పథం’ అనే అంశంపై బీవీ రాఘవులు స్మారకోపాన్యాసం చేశారు.