హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. మొన్నటికి మొన్న అమరరాజా గ్రూప్ 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పెట్టుబడితో పాటు 4,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది. తాజాగా తెలంగాణలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యాపిటల్యాండ్ ముందుకు వచ్చింది. ఐటీ కారిడార్లో రూ. 6,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు క్యాపిటాల్యాండ్ ప్రకటించింది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో క్యాపిటాల్యాండ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ దాస్ గుప్తా, రియల్ అసెట్స్ సీఈవో పాట్రిక్ బూకాక్ పాల్గొన్నారు.
రూ.6,200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు నగరంలోని ఐటీ కారిడార్లో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు క్యాపిటల్యాండ్ తెలిపింది. రూ. 1,200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ మాదాపూర్లోని సీఎల్ఐఎన్టీ ఇంటర్నేషనల్ టెక్ పార్ లో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగి ఉండే ఈ ఐటీపీహెచ్ డేటా సెంటర్ను 5 సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తమకున్న సుమారు 6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న ఐదు సంవత్సరాలలో మరో రూ. 5 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తంగా రూ.6200 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు కంపెనీ తన ప్రణాళికను వెల్లడించింది.
In the presence of Minister @KTRTRS, Telangana Govt. and @CapitaLand India Trust (CLINT) have signed an MoU whereby the latter is setting up a 36 MW capacity data centre in Madhapur with ₹1200 Cr investment. The 2,50,000 sq ft data centre will be operational by the end of 2024. pic.twitter.com/t5sxXb2yeN
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 6, 2022