Tesla | శాన్ఫ్రాన్సిస్కో, డిసెంబర్ 10: ఎప్పుడూ సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకొనే ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ఇప్పుడు సరికొత్త కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏదైనా ప్రమాదం జరిగి కారు ఎయిర్ బ్యాగులు తెరుచుకోగానే వెంటనే ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్ వెళ్లిపోతుంది. దీంతో ప్రమాదంలో గాయపడ్డవారి ప్రాణాలు కాపాడొచ్చని టెస్లా తెలిపింది.
దీంతోపాటు ఆపిల్ పాడ్‌కాస్ట్ సపోర్ట్, రెయిర్ స్క్రీన్ బ్లూటూత్ హెడ్సెట్ సపోర్ట్, 3డీ విజువల్స్‌తో కూడిన పార్కింగ్ అసిస్టెంట్, బ్లైండ్ స్పాట్ ఇండికేటర్లు ఇందులో ఉంటాయని పేర్కొన్నది. టెస్లా యాప్ ట్రిప్ ప్లానర్ అనే ఫీచర్ కూడా ఉంటుందని, ఎక్కడెక్కడ ఆగాలో ముందే వాహనానికి సమాచారం అందించొచ్చని తెలిపింది. బ్లైండ్ స్మార్ట్ కెమెరా అనేది సిగ్నల్ ఆన్ అయినప్పుడు బ్లైండ్ స్పాట్లో కారుంటే వెంటనే రెడ్ షేడింగ్తో అప్రమత్తం చేస్తుందని పేర్కొన్నది. హై ఫిడెలిటి పార్క్ అసిస్టెంట్ ద్వారా కారుచుట్టూ 3డీ యాంగిల్లో చూస్తూ సురక్షితంగా పార్క్ చేయొచ్చని వివరించింది.