హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ స్వయంగా తన కెమెరాలో బంధించిన చిత్రాలతో ఫిల్మ్ డెవలప్మెట్ కార్పొరేషన్ చైర్మన్ (ఎఫ్డీసీ) చైర్మన్ అనిల్ కూర్మాచలం క్యాలెండర్‌గా రూపొందించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఎంపీ సంతోష్‌కుమార్ ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించి అనిల్‌ను అభినందించారు.
ఈ క్యాలెండర్ తనకో జ్ఞాపకంగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్‌సింగ్, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు.