Munugode By Polls | మునుగోడులో మొదలైన పోలింగ్
munugode by polls | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ను ఆయా పోలింగ్ స్టేషన్లలో సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. అంతకు ముందు మాక్
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ను ఆయా పోలింగ్ స్టేషన్లలో సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. అంతకు ముందు మాక్ పోలింగ్‌ను నిర్వహించారు. చాలాచోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా.. 2.41లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,21,720 మంది పురుష, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అయితే, ఎన్నికల్లో మూడు బ్యాలెట్ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేశారు. మరో వైపు ఎన్నికలకు భారీ భద్రతను కల్పించారు. 5,500 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో మోహరించారు. 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించగా.. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ చేయడంతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 35 శాతం ఈవీఎంలను అదనంగా సిద్ధం ఉంచగా.. సాంకేతిక లోపాలు తలెత్తితే.. సరిచేయడానికి 28 మంది ఇంజినీర్లను నియమించారు. నియోజకవర్గంలో మొత్తం 199 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

