Medicines | లైసెన్స్ చూసి మందులు కొనండి.. ప్రజలకు డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి సూచన
ప్రజలు ఔషధాలు కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఆ దుకాణానికి లైసెన్స్ ఉన్నదో లేదో పరిశీలించాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలాసన్ రెడ్డి సూచించారు.
- హైదరాబాద్ సంతోష్‌నగర్‌లో మెడికల్ షాప్ సీజ్
- అనుమతి లేని 111 రకాల మందుల విక్రయం
Medicines | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రజలు ఔషధాలు కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఆ దుకాణానికి లైసెన్స్ ఉన్నదో లేదో పరిశీలించాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలాసన్ రెడ్డి సూచించారు. అనుమతులు లేని దుకాణాల్లో నకిలీ మందులు అమ్మేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్, సంతోష్‌నగర్‌లో లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న ఓ మెడికల్ షాప్‌లో గురువారం తనిఖీలు చేసినట్టు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండానే మొత్తం 111 రకాల మందులు విక్రయిస్తున్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఇందులో తరుచుగా వాడే మందులతోపాటు యాంటీ బయాటిక్స్, ఇన్సులిన్, యాంటీ వైరల్, పెయిన్ కిల్లర్స్ వంటివి కూడా ఉన్నట్టు తెలిపారు. వీటి విలువ రూ.3.20 లక్షలు అని వివరించారు.
షాప్ నిర్వాహకుడు మహ్మద్ ఇల్తేఫా అహ్మద్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. లైసెన్స్ లేని దుకాణాల్లో తప్పుడు మందులు ఇచ్చే అవకాశం ఉన్నదని, ఇవి వ్యాధిని తగ్గించకపోగా కొత్త సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. మెడికల్ షాపుల్లో కచ్చితంగా అందరికీ కనిపించే చోట లైసెన్స్‌ను ప్రదర్శించాల్సి ఉంటుందని సూచించారు. మెడికల్ షాప్‌పై అనుమానం ఉంటే https://odls.telangana.gov. in/ThirdPartypublicview.aspx వెబ్సైట్ లింక్‌ను ఓపెన్ చేసి.. అందులో వచ్చే విండోలో మెడికల్ షాప్ పేరును ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయని చెప్పారు. సందేహాలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969 నంబర్‌కు సమాచారమివ్వాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

