స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు గొప్పవరం టీహబ్ 2.0
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీహబ్ 2.0 మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ అద్భుత ఆవిష్కరణపై దేశవిదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు
ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖుల ట్వీట్లు
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీహబ్ 2.0 మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ అద్భుత ఆవిష్కరణపై దేశవిదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. భారతదేశ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు టీహబ్ 2.0 గొప్ప వరమని కితాబిచ్చారు.
హైదరాబాద్‌లో కొత్త టీహబ్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కే చంద్రశేఖర్‌రావుకు అభినందనలు. భారత స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఇది గొప్ప ఊతమిస్తుంది. – రతన్‌టాటా, టాటా గ్రూపు గౌరవ చైర్మన్
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసిన కేటీఆర్‌కు అభినందనలు. టీహబ్ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడంలో విజయవంతమైనందుకు ఆనందంగా ఉన్నది.
– సింధు గంగాధరన్ సాప్ ల్యాబ్స్ ఇండియా ఎండీ,
భారత్‌లో ఎంటర్ప్రెన్యూర్షిప్కు మరింత బలం చేకూర్చేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఉపయోగపడుతుంది. టీహబ్ 2.0ను ప్రారంభించిన నా స్నేహితుడు కేటీఆర్, ఆయన బృందానికి శుభాకాంక్షలు.
– గోవా ఎమ్మెల్యే రోహన్ ఖౌంటే
మంత్రి కేటీఆర్ ఆలోచన నుంచి పుట్టిన టీహబ్ కొత్త సౌకర్యం హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్లడానికి 8 సంవత్సరాలుగా ఎడతెరిపిలేకుండా చేస్తున్న ప్రయత్నాల ప్రతిరూపం. – ఎంపీ రంజిత్‌రెడ్డి
హ్యాపెనింగ్ హైదరాబాద్‌కు మరో మైలురాయి. అతిపెద్ద ఇక్యుబేటర్ తలుపులు తెరుచుకొన్నాయి. అపురూపమైన స్పేస్, అపురూపమైన ఎనర్జీ, అపురూపమైన స్టార్టప్ ఎకోసిస్టమ్. ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్కు అద్భుతమైన ప్రోత్సాహం అందించనున్నాయి. టీహబ్ ఫేజ్-2కు యూకే ఇన్ హైదరాబాద్ శుభాకాంక్షలు.
– డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఏపీ అండ్ టీఎస్ యూకే హైకమిషనర్
కొత్త రాష్ట్రంలో మరోమైలురాయి టీహబ్ 2.0. కేటీఆర్ గొప్ప విజన్, ఫోకస్‌తో అద్భుత భవిష్యత్తు రూపొందుతున్నది. బెస్ట్ ఇన్ఫ్రా, బలమైన టెక్ ఎకోసిస్టమ్, భారీ పెట్టుబడులతో గొప్ప అవకాశాలు సృష్టించబడుతున్నాయి. నిజంగా ఇది హ్యాపెనింగ్ హైదరాబాద్. -క్రెడాయ్ హైదరాబాద్
ఆలోచనతో రండి.. ఆవిష్కరణతో వెళ్ళండి అన్న నినాదంతో తెలంగాణ ప్రభుత్వం 2015లో భారతదేశపు అతిపెద్ద ఇంక్యుబేటర్ టీహబ్‌ను ప్రారంభించింది. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీహబ్ 2.0ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి
స్టార్టప్‌లు విజయవంతం కావాలంటే టీహబ్ లాంటి వ్యవస్థలు చాలా అవసరం. ఇవి ఆవిష్కరణ, సహకారానికి ఊతం ఇవ్వటంతోపాటు వ్యవస్థాపకులకు లెక్కలేనన్ని అవకాశాలను కల్పిస్తాయి. ఆవిష్కరణల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభిరుచి బాగున్నది.
– కేశవ్ ఆర్ మురుగేశ్, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ సీఈవో
తమిళనాడుకు కూడా టీహబ్ హైదరాబాద్ లాంటిది అవసరం ఉన్నది @సీఎంవో తమిళనాడు. – కార్తి చిదంబరం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

