చిరుతనే కుమ్మేసిన బర్రెలు.. ఎక్కడో తెలుసా?
చిరుత | జంతువులను వేటాడే చిరుత పరాజయం పాలైంది. బర్రెలపై దాడికి యత్నించిన చిరుతపైనే అవి తిరిగి ఎదురుదాడికి దిగాయి. దీంతో చిరుత గాయాలపాలైంది.

మహబూబ్‌నగర్ : జంతువులను వేటాడే చిరుత పరాజయం పాలైంది. బర్రెలపై దాడికి యత్నించిన చిరుతపైనే అవి తిరిగి ఎదురుదాడికి దిగాయి. దీంతో చిరుత గాయాలపాలైంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం బూర్గుపల్లి సమీపంలో చోటు చేసుకుంది.
బూర్గుపల్లి సమీపంలో ఓ పశువుల కొట్టంలోకి చిరుత నిన్న రాత్రి ప్రవేశించింది. అక్కడున్న బర్రెలపై దాడికి చిరుత యత్నించింది.
ఈ క్రమంలో బర్రెలు ఏ మాత్రం బెదరకుండా.. చిరుతపై ఎదురుదాడి చేశాయి. దీంతో చిరుత ముందరి కాళ్లతో పాటు నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. చిరుత లేచి నడవలేని పరిస్థితిలో ఉండిపోయింది.
ఈ ఉదయం చిరుతను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. చిరుతను హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌కు అధికారులు తరలించారు. నడవలేని స్థితిలో ఉన్న చిరుత దగ్గరకు స్థానికులు వెళ్లి వీడియోలు చిత్రీకరించారు. స్థానికులను చూసిన చిరుత గాండ్రిపులు చేసింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

