Manthani Rural | పెద్దపల్లి జిల్లాలో దళిత యువకుని దారుణ హత్య
Manthani Rural | పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
మంథని రూరల్, మే 10 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం మంథని మండలం గాడిదల గండి సమీపంలో కుళ్లిన స్థితిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్ 30వ తేదీ నుండి వంశీ కనబడకుండా పోవడంతో మూడు, నాలుగు రోజుల తర్వాత అతని కుటుంబ సభ్యులు గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
మృతుని కాల్ డేటా ఆధారంగా హైదరాబాద్ కు సంబంధించిన ఒక యువతి ని కలవడానికి వెళ్ళినట్లు గుర్తించిన పోలీసులు ఆ యువతిని అతని భర్తను తీసుకొచ్చి విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
లవ్ ఎఫైరే హత్యకు కారణమా?
సింగిరెడ్డిపల్లికి చెందిన వంశీ అదే గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. తర్వాత క్రమంలో ఆమె వేరొకరిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయినట్లు తెలిసింది. కాగా, ఇటీవల గ్రామ దేవతల కొలుపు సందర్భంగా తిరిగి గ్రామానికి వచ్చిన యువతితో మళ్లీ అతను చనువుగా వ్యవహరించడంతో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి.
ఇది తెలిసిన ఆ యువతి భర్త చాకచక్యంగా ఆ యువతి తోటే అతన్ని ఏప్రిల్ 30న హైదరాబాద్‌కు పిలిపించి హత్య చేసి అతని శవాన్ని మంథని సమీపంలోని గాడిదల గండిలో వేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకోవడంతో వంశీ మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైనట్లు సమాచారం. హత్య జరిగి సుమారు పది రోజులు కావడంతో అతని మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో లభ్యమయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

