Prajavani | జీతం రాలేదని అడిగితే ఉద్యోగం నుంచే పీకేశారు.. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినందుకు ప్రతిఫలం!
Prajavani | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం నామమాత్రంగానే మారిపోయిందని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజాభవన్‌కు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Prajavani | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం నామమాత్రంగానే మారిపోయిందని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజాభవన్‌కు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వాణిలో ఫిర్యాదు చేస్తే సమస్యలకు పరిష్కారం దొరకాల్సిందిపోయి.. కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. తాజాగా జీతం రాలేదని అడిగినందుకు ఓ మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసేశారు.
మేడ్చల్ జిల్లాకు చెందిన రేణుక హైదరాబాద్‌లోని నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నది. ఆమె జీతం రూ.15వేలు కాగా.. ఏజెన్సీ మాత్రం వేతనంలో కోత పెట్టి రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదు. దీంతో ప్రజా భవన్‌కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఏజెన్సీ ఆ మరుసటి రోజే రేణుకను ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో మంగళవారం సాయంత్రం ప్రజాభవన్‌కు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తిరిగి ఇప్పించాలని కోరారు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతం రావడం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినందుకు ప్రభుత్వం ఉద్యోగంలో నుంచే తీసేసిందని మండిపడ్డారు. ప్రజా వాణిలో ఆర్భాటం ఎక్కువ.. పరిష్కారం తక్కువగా ఉందని విమర్శించారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన అని ఎద్దేవా చేశారు. రేణుకను ఉద్యోగంలో నుంచి తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది పేదలకు ప్రజా దర్బార్ వల్ల సమస్యలు పరిష్కారమయ్యో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- KTR
- Praja Palana
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

