KTR | ఆ 80 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన కేటీఆర్
KTR | రేవంత్ కుర్చీ ఎక్కిన రోజు నుండి మొత్తం 80,500 కోట్లు అప్పు తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పది నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారని అన్నారు. అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలని ప్రశ్నించారు.
KTR | రేవంత్ కుర్చీ ఎక్కిన రోజు నుండి మొత్తం 80,500 కోట్లు అప్పు తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పది నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారని అన్నారు. అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలని ప్రశ్నించారు. ఎన్నికల హమీలేవీ తీర్చలేదు..! ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు..!! మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు ? 80 వేల కోట్ల ధనం ఎవరి జేబులోకి వెళ్లినట్టు ?? అని నిలదీశారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా ? కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా ?? అని ప్రశ్నించారు.
అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి…అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టామని.. ప్రతిపైసాతో మౌలిక సదుపాయాలు పెంచామని.. తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చామని తెలిపారు. కానీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెస్తున్న అప్పుల “అడ్రస్” ఎక్కడ అని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా.. రైతుభరోసా వేయకుండా.. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా.. నెలలపాటు జీతాలు ఇవ్వకుండా.. ఇన్ని వేలకోట్లు ఏమైనట్టు ? ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు అని ప్రశ్నించారు. రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా.. సొంత ఆస్తులు పెంచుకోవడానికి.. అప్పులు చేయడం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదమని హెచ్చరించారు.
ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల అప్పు తీసుకున్నది. స్వయంగా ఆర్డీఐ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో నిరుడు డిసెంబర్ 7న అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 315 రోజుల్లో రేవంత్‌రెడ్డి సర్కా రు తెచ్చిన అప్పులు రూ.74,495 కోట్లకు పెరిగాయి. గత నెలలో 3 దఫాలుగా రూ.4,500 కోట్ల రుణాలు పొందిన రేవంత్ ప్రభుత్వం.. ఈ నెల 1న రూ.2,000 కోట్ల అప్పు తీసుకున్నది. తాజాగా 21 ఏండ్ల కాలానికి బాండ్‌ను జారీచేసి మరో రూ.1,000 కోట్ల అప్పు తెచ్చింది. ఇలా ప్రతి నెలా రూ.5-6 వేల కోట్ల రుణాలు సమీకరిస్తున్న రేవంత్ సర్కారు ఇప్పటివరకు ఒక్క ఆర్బీఐ నుంచే 49,618 కోట్ల అప్పులు తెచ్చింది. ఇవి చాలక కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు గ్యారంటీలు ఇవ్వడంతో మరో రూ.25 వేల కోట్ల వరకు రుణాలను సేకరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- KTR
- Revanth Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

