KTR | నూతన న్యాయ చట్టాలపై మీ వైఖరేంటి? కొన్ని రాష్ర్టాల్లా సవరణలు కోరుతారా?.. ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ
కేంద్రం తెచ్చిన నూతన న్యాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన మూడు చట్టాలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్నదని పేర్కొన్నారు.
- వీటితో ప్రాథమిక హక్కులకు విఘాతం
- కొన్ని రాష్ర్టాల్లా సవరణలు కోరుతారా?
- లేదంటే యథావిధిగా అమలు చేస్తారా?
- అదే జరిగితే నిరంకుశ పాలన అవుతుంది
- ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ
KTR | హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): కేంద్రం తెచ్చిన నూతన న్యాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన మూడు చట్టాలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్నదని పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఏఏ) స్థానంలో భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ) చట్టాలపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఉద్యమాల అడ్డాగా ఉన్న తెలంగాణ ప్రజాస్వామ్య హకుల కోసం ఉకు పిడికిళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని తెలిపారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ర్టాలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని, కాబట్టి తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేశారు.
వ్యక్తి స్వేచ్ఛను హరించేలా చట్టాలు
నూతన చట్టాలు ప్రజల ప్రాథమిక హకులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని హక్కుల సంఘాలు చేస్తున్న నిరసనను ఈ సందర్భంగా కేటీఆర్ ఉదహరించారు. నూతన చట్టాలతో పౌరుల హకులకు హాని కలిగించే అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం కొత్త చట్టాల ప్రకారం నేరమని, ఇది అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న 15 రోజుల పోలీసు కస్టడీని 90 రోజులకు పెంచడం, వ్యవస్థీకృత నేరాల విషయంలో వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయడానికి దర్యాప్తు సంస్థలకు ఏకపక్ష, విచక్షణ అధికారాలను కొత్త చట్టం అనుమతినిస్తున్నదని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, పౌరహక్కుల విషయంలో నూతన చట్టా లు అత్యంత దారుణంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా? లేదా? అనే విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. ఈ చట్టాల్లోని నియంతృత్వ నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ప్రభుత్వాన్ని నిరంకుశ, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ప్రజలు పరిగణిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.
బహిరంగ లేఖ పూర్తి పాఠం..
దేశంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త న్యాయ చట్టాలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టాల్లో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హకులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయి. నూతన చట్టాల్లో పేరొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా..
తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, ఉద్యమాలకు అడ్డా. పౌరహకుల పరిరక్షణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడే స్వభావం ఉన్న నేల ఇది. ప్రజాస్వామ్య హకుల కోసం ఉకు పిడికిళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అలాంటి తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటీవల కేంద్రం తెచ్చిన చట్టాలతో అలజడి రేగుతున్నది. దేశంలో అమల్లోకి వచ్చిన నూతన న్యాయచట్టాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న పాత చట్టాల స్థానాల్లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలు జూలై 1 సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఏఏ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ) అమల్లోకి వచ్చాయి. అయితే, పలు వర్గాల నుంచి నూతన చట్టాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ చట్టాల్లో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హకులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని హకుల సంఘాల ప్రజా మేధావులు అభిప్రాయపడుతున్నారు! న్యాయమైన డిమాండ్ల పరిషారం కోసం నిరసనలు.. ఉద్యమాలు చేసే ప్రజలకు ప్రతికూలంగా కొత్త చట్టాలు ఉన్నాయని.. పోలీసులకు, ప్రభుత్వానికి మితిమీరిన అధికారాన్ని కట్టబెడుతున్నాయని సామాజిక ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు! ప్రజా స్వామికవాదులు, న్యాయ నిపుణులు మాత్రమే కాదు, పలు రాష్ర్టాలు సైతం ఈ నూతన చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి!. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు! కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఇకడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పలేదు! రేవంత్‌రెడ్డి ఈ అంశంలో తన వైఖరిని స్పష్టం చేయాలి!.
న్యాయకోవిదులు.. అనుభవజ్ఞులైన క్రిమినల్ లాయర్లు, దర్యాప్తుసంస్థలు, న్యాయమూర్తులు, సాధారణ పౌరులతో విస్తృత స్థాయిలో సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించకుండానే ఈ చట్టాలను తొందరపాటుతో తీసుకువచ్చారు. లోక్ సభ, రాజ్యసభ నుంచి ఏకంగా 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి, ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన చట్టాల అమలు నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ ఈ చట్టాల అమలు నిలిపివేయాలని సుప్రీం కోర్టులో కేసు వేశారు.
ఈ చట్టాల్లో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు అత్యంత దారుణంగా ప్రజల హకులను, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారం నిందితులకు బెయిలిచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి, పోలీసులకు, ప్రభుత్వానికి విపరీతమైన అధికారాలు సంక్రమిస్తాయి. ఇందులో పౌరుల హకులకు హాని కలిగించే కొన్ని ముఖ్యమైన అంశాలను ఇకడ ప్రస్తావిస్తున్నాను.
ఈ చట్టాల ప్రకారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం నేరం. ఇది అత్యంత దురదృష్టకరం. ఈ చట్టం ప్రజల హకుల కోసం పోరాటం చేసే పౌరులకు ప్రమాదకారిగా మారుతుంది. గతంలో ఉన్న 15 రోజుల పోలీసు కస్టడీ ఇప్పుడు 90 రోజులకు పెరిగింది. ఈ గడువును ఉపయోగించుకొని ఎన్ని సార్లయినా కస్టడీలోకి తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ కస్టడీని ఒకే దఫాలో కానీ, పలు దఫాల్లో కానీ అమలుపరచవచ్చు. తద్వారా నిందితుడికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. క్రిమినల్ కేసులో ఉన్న నిందితుల ఆస్తులను జప్తు చేయడానికి కోర్టు అనుమతి అవసరం ఉండేది. అయితే, కొత్త చట్టంలో పోలీసులకు పూర్తి అనుమతి లభించింది.
వ్యవస్థీకృత నేరాలకు వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయడానికి దర్యాప్తు సంస్థలకు ఏకపక్ష, విచక్షణ అధికారాలను కొత్త చట్టం అనుమతిస్తుంది. జాతీయ భావాలను ప్రభావితం చేసే నేరాలకు మూడేండ్ల జైలుశిక్ష, జరిమానా. సైబర్ నేరాలు, హ్యాకింగ్, ఆర్థిక నేరాలు, గోప్యత, సాంకేతికత ద్వారా విధ్వంసం వంటి వాటికోసం రూపొందించిన ప్రత్యేక అధ్యాయంలో అనేక అస్పష్టతలున్నాయి. కొత్త చట్టాల అమలుకు ముందు (జూలై 1, 2024కి ముందు) జరిగిన నేరాలను ఐపీసీ తదితర పాత చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. తర్వాత నమోదయ్యే కేసులను నూతన చట్టాల ప్రకారం విచారణ చేయాల్సి వస్తుంది. ఇది అందరినీ అయోమయంలోకి నెడుతున్నది.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రమాదకర కొత్త చట్టాలపై తన వ్యతిరేకతను ఇప్పటికే తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో ఇప్పటిదాకా ఒక మాట కూడా మాట్లాడలేదు. రేవంత్ సరారు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. నూతన చట్టాల్లో ఉన్న నియంతృత్వపూరిత సెక్షన్లను సవరించాలని కేంద్రానికి లేఖ రాయాలి.
‘స్వాతంత్య్రోద్యమంలో నాటి జాతీయ నాయకులను జైళ్లలో పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన ‘రాజద్రోహ’ చట్టం అమలును సుప్రీంకోర్టు 2022లో నిలిపివేసింది. ఈ చట్టంపై సమీక్ష జరుపుతామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. కానీ, కొత్త చట్టంలో తిరిగి ‘రాజద్రోహం’ చట్టాన్ని ‘దేశద్రోహం’ పేరుతో తీసుకువచ్చింది. ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి ప్రజలకున్న హకును కాలరాసేందుకే ఈ చట్టం ఉపయోగపడుతున్నదన్న విమర్శలున్నాయి. నూతన చట్టాలపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ఇకడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రుల మాదిరి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంలో తన వైఖరిని స్పష్టం చేయాలి. ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తెలంగాణ గడ్డపై నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను ఇకడ యథాతథంగా అమలు చేయడమే రాష్ట్ర సరారు లక్ష్యమా? లేక ఇతర రాష్ర్టాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా?అనే విషయాన్ని ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలి.
నూతన చట్టాల్లో పేరొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉన్నది. గత ఏడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, సోషల్‌మీడియా కార్యకర్తలను ఎకడికకడ అణచివేసేందుకు పోలీసులను విసృ్తతంగా వినియోగిస్తున్నది. నూతన చట్టాల నేపథ్యంలో ఈ పరిణామాలు రాష్ట్రంలో మరింత దుర్మార్గమైన వాతావరణాన్ని సృష్టించే ప్రమాదం పొంచి ఉన్నది. ప్రజా పాలన అంటూ చెప్పుకొని ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ నూతన చట్టాలపై తన వైఖరిని తెలియజేయాల్సిన అవసరం ఉన్నది.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రమాదకర చట్టాలపై తన వ్యతిరేకతను ఇప్పటికే తెలియజేసింది. అయితే ఈ అంశంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈ అంశంలో ఇప్పటికైనా రేవంత్ సరారు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. నూతన చట్టాల్లో ఉన్న నియంతృత్వపూరిత సెక్షన్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలి. దీంతోపాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరపున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రజలను, పౌరులను అణచివేసే చట్టాలపైన, అందులోని సెక్షన్లపై రాష్ట్ర చట్టపరమైన పరిధి మేరకు ఒక కమిటీని వెంటనే నియమించి ఈ చట్టాల మీద తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలి. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను.
– కల్వకుంట్ల తారకరామారావు
(మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

