KTR | సన్నాసి ఎవరు..? రాహుల్ గాంధీనా..? రేవంత్ రెడ్డినా..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్
KTR | తెలంగాణలోని నిరుద్యోగులను, విద్యార్థులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాంధీ సన్నాసా..? లేక రేవంత్ రెడ్డి సన్నాసా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
KTR | హైదరాబాద్ : తెలంగాణలోని నిరుద్యోగులను, విద్యార్థులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాంధీ సన్నాసా..? లేక రేవంత్ రెడ్డి సన్నాసా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల సమావేశంలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6 వేల అదనపు పోస్టులతో డీఎస్సీ అభ్యర్థులను దగా చేశాడు. నేడు విద్యార్ధులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లు డైయిరీలో నమోదు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినాక వదిలిపెట్టం. ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలనా అని కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ హామీనే.. నిరుద్యోగులు అడుగుతున్నారు..
సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా భరించలేని నిరంకుశ మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తమ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపైన పోలీసు దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ గాంధీతో సహా నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి దినపత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇచ్చారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన కాంగ్రెస్ హామీనే.. నిరుద్యోగులు, విద్యార్థులు అడుగుతున్నారు. నిరుద్యోగులందరికీ రాజకీయాలను రేవంత్ అంటగడుతున్నాడు అని కేటీఆర్ తెలిపారు.
అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు..
ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో సహా పలువురు నేతలను విద్యార్థులు కలిశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాతోపాటు, ఇతర పార్టీ నాయకులను కలుస్తున్నారు. ఉద్యోగాలను.. నోటిఫికేషన్లను అడిగితే వారిని అవమానపరిచేలా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి విద్యార్ధుల చుట్టు చేరి వారిని ఎన్నికల కోసం వాడుకున్న రేవంత్ రెడ్డి సన్నాసా..? లేక అప్పుడు వారిని కలిసిన రాహుల్ గాందీ సన్నాసా..? రేవంత్ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
వీపులు పగలగొట్టడమే ప్రజా పాలనా..?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి.. తలలు పగలగొట్టడం.. వీపులు పగలగొట్టడమే ప్రజా పాలనా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. పాత అరాచకాల కాంగ్రెస్… మోసపూరితంగా కొత్త రూపంలో వచ్చిందని ప్రజలు ఆరు నెలల్లోనే అర్థం చేసుకుంటున్నారు. ఇచ్చిన హామీలు పక్కకు వదిలేసి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను కూడా రద్దు చేస్తున్నారు. ఇదేమి అన్యాయమని అడిగిన వాళ్లందరిపైన కేసులు నమోదు చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు ప్రయివేటు విశ్వవిద్యాలయాలు వద్దన్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే 7 కొత్త వాటికి అనుమతులు ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.
ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని మాత్రం మర్చిపోరు..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 50 వేల ఉద్యోగాలతోని మెగా డీఎస్సీ విడుదల చేయాలని రేవంత్ రెడ్డి మాట్లాడిండు, కానీ ఈనాడు మెగా డీఎస్సీ అనే మాట మరిచిపోయిండు. కానీ ఇప్పుడు కేవలం సూమారు 6000 ఉద్యోగాలు అదనంగా ఇచ్చి డీఎస్సీ పేరుతో యువకులను మోసం చేస్తుండు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు తెలంగాణ కథానాయకుడిగా నిలబడిపోతారు. ఈరోజు విద్యార్థులపై దాడులతో చేస్తున్న గాయాలు మానిపోయినా, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని మాత్రం మర్చిపోరు. తెలంగాణ పోలీసులు అధికారులు విద్యార్థుల పైన చేస్తున్న దాడులను విద్యార్థి నాయకులు తమ డైరీలో నమోదు చేసుకుంటున్నారు. విద్యార్థులపైన, ప్రజలపైన దాడులు చేస్తున్న పోలీస్ అధికారులను, మేము తిరిగి అధికారంలోకి వచ్చినంక వదిలిపెట్టం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
1.62 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం..
పదేళ్ల మన ప్రభుత్వ హయాంలో లక్ష అరవై రెండు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాము. మరో 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉండే. అందులోంచి 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలను రేవంత్ రెడ్డి ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. విద్యార్థుల ఉద్యోగాల కోసం 95 శాతం స్థానిక రిజర్వేషన్లు కల్పించాం అని కేటీఆర్ గుర్తు చేశారు.
విద్యార్థి నాయకుల పాత్ర కీలకం..
పార్టీ విద్యార్థి విభాగం నుంచి అనేకమంది నాయకులను, ప్రజాప్రతినిధులుగా, చైర్మన్లుగా, మేయర్లుగా, జిల్లా స్థాయి అధ్యక్షులుగా అనేకమందిని పార్టీ తయారు చేసుకోగలిగింది. అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విద్యార్థి నాయకుల పాత్ర కీలకమవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలిగే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ అన్యాయాలను అక్రమాలను ఎండగట్టవచ్చు. రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ అవకాశం ఉంటుంది.
నిజాయితీపరులు, దమ్మున్న నాయకులు వందలు, వేలమంది బీఆర్ఎస్ పార్టీకి ఆస్తిగా ఉన్నారు. 2009 నుంచి 2014 దాకా తెలంగాణ కోసం విద్యార్థులు చేసిన గొప్ప ఉద్యమ స్ఫూర్తిని పోరాటాలను ఇప్పటి విద్యార్థులకు చెప్పేలా చేయాలి. విద్యారంగంలో జరిగే ప్రతి అన్యాయం దగ్గర విద్యార్ధి విభాగం ఆందోళన ఉండాలని కేటీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

