కేసీఆర్ ఉన్నప్పుడే గౌరమ్మా.. బతుకంత పచ్చగుండే గౌరమ్మా!
‘కేసీఆర్ ఉన్నప్పుడే గౌరమ్మా.. బతుకుంత పచ్చగుండే గౌరమ్మా.. ఇంటికీ నల్లొచ్చె గౌరమ్మా.. చేనుకు నీరొచ్చె గౌరమ్మా.. కరెంట్ ఉండేది.. రైతుబంధొచ్చేది.. యూరియా ఇచ్చేది.. పెండ్లిండ్లు చేసేది.. అవ్వలు మురిసేది.. తాతాలూ నవ్వేది.. ఆమ్దాని పుట్టేది.. ఆనందమయ్యేది.. ఘనముగా పాలించె గౌరమ్మా.. జనమంతా జైకొట్టే గౌరమ్మా.. కేసీఆర్ ఉన్నప్పుడే.. ఆనాడే బాగుండె గౌరమ్మా’ అంటూ కేసీఆర్ పదేండ్ల పాలనను కీర్తిస్తూ పాటలు పడుతూ బీఆర్ఎస్ మహిళా నేతలు బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు.
- తెలంగాణ భవన్లో అంబరాన్నంటిన ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు
- ఆడిపాడిన బీఆర్ఎస్ మహిళా నేతలు
- హాజరైన పద్మా దేవేందర్‌రెడ్డి, తుల ఉమ, గొంగిడి సునీత తదితరులు
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తేతెలంగాణ): ‘కేసీఆర్ ఉన్నప్పుడే గౌరమ్మా.. బతుకుంత పచ్చగుండే గౌరమ్మా.. ఇంటికీ నల్లొచ్చె గౌరమ్మా.. చేనుకు నీరొచ్చె గౌరమ్మా.. కరెంట్ ఉండేది.. రైతుబంధొచ్చేది.. యూరియా ఇచ్చేది.. పెండ్లిండ్లు చేసేది.. అవ్వలు మురిసేది.. తాతాలూ నవ్వేది.. ఆమ్దాని పుట్టేది.. ఆనందమయ్యేది.. ఘనముగా పాలించె గౌరమ్మా.. జనమంతా జైకొట్టే గౌరమ్మా.. కేసీఆర్ ఉన్నప్పుడే.. ఆనాడే బాగుండె గౌరమ్మా’ అంటూ కేసీఆర్ పదేండ్ల పాలనను కీర్తిస్తూ పాటలు పడుతూ బీఆర్ఎస్ మహిళా నేతలు బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు.
‘కాంగ్రెస్ వచ్చింది కాలమూ బోయింది.. కరెంట్ బోయింది.. కన్నీళ్లు నింపింది.. నోటిఫికేషన్లు నోటిమాటలాయే.. 420 హామీలు గాలిలో మేడలాయే.. కేసీఆర్ రావాలె గౌరమ్మా.. మన కష్టాలు పోవాలె గౌరమ్మా’ అంటూ కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు.. ఎగ్గొట్టిన హామీలను ఎండగడుతూనే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే మేలు జరుగుతుందని పాటల ద్వారా కోరుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వేడుకగా నిర్వహించారు.
లోటస్‌పాండ్‌లో నిమజ్జనం
తెలంగాణ భవన్ నుంచి ఊరేగింపుగా వెళ్లి కేబీఆర్ పార్క్ సమీపంలోని లోటస్‌పాండ్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. తర్వాత వాయినాలు ఇచ్చిపుచ్చుకుని ఫలహారాలు పంచుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ విప్ గొంగిడి సునీత, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మంత్రి శ్రీదేవి, రజనీ సాయిచంద్, సుమిత్రానంద్, మాజీ కార్పొరేటర్లు చింతల విజయశాంతి, సామల హేమ, రాసూరి సునీత, డీపీరెడ్డి, పద్మ, కంది శైలజ, నవతారెడ్డి, కిర్తీలత, విజితారెడ్డి, రేణుక, ముఖ్య నేతలు శకీలారెడ్డి, సత్యవతి, పద్మావతి, పావనీగౌడ్, రజితారెడ్డి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

