KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకార ఇస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
హైదరాబాద్ : సహకార సంఘాల ( Cooperative Societies ) బలోపేతానికి బీఆర్ఎస్ సహకార ఇస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) హామీ ఇచ్చారు. సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సహకార సంఘాల అధ్యక్షులు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి విన్నవించారు. కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుప్పకూలుతున్న సహకార వ్యవస్థ పంట రుణాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో సహకార బ్యాంకుల మొత్తం వ్యాపారం సుమారు రూ.13 వేల కోట్లుండగా కేసీఆర్ నేతృత్వంలోని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అది రూ.60 వేల కోట్లకు చేరిందని వివరించారు. రైతాంగానికి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం సహకార సంఘాలు, బ్యాంకులను బలోపేతం చేసిందని పేర్కొన్నారు.
సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి కల్పించి, ఎన్నికల ద్వారా పాలకవర్గాలను ఏర్పాటు చేయడంతో రైతులకు చేరువగా సేవలు అందించగలిగాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలకవర్గాలతో వ్యవస్థను నడిపిస్తుండటంతో సహకార రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల సహకార సంఘాల పదవులను రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు తీసుకుని కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.
బ్యాంకుల సీఈవోలకు పరిమిత అధికారాలే ఉండటంతో రూ.10 లక్షలకు మించిన రుణాల మంజూరుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతోందన్నారు. సహకార సంఘాల అధ్యక్షుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్ తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సహకార రంగాన్ని బలోపేతం చేయడం, ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన చర్యలకు మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

