సింగరేణిలో.. స్కాం గ్రెస్..
బొగ్గు నిల్వల్లో గోల్మాల్.. ‘నైని’ టెండర్ల నివేదికలు ‘బ్లాక్'.. అమలుకు నోచని కాంగ్రెస్ హామీలు.. నేడు నిర్వహించే కార్మిక గర్జన సభలో కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీయనున్న బీఆర్ఎస్
కరీంనగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గోదావరిఖని: బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధికి బాటలు వేసి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయగా కాంగ్రెస్ పాలనలో మాత్రం సింగరేణి మొత్తం కుంభకోణాల మయంగా మారింది. తమ అనుకున్న వారికి బొగ్గు గనులు ఇప్పించేందుకు సైట్ విజిట్ పేరిట కొత్త నిబంధనలు తెచ్చి, నిబంధనలకు తూట్లు పొడువడం, బొగ్గు నిల్వల్లో గోల్‌మాల్‌కు పాల్పడటం, నైని బొగ్గు గని టెండర్ల వ్యహారంలో భారీ కుంభకోణాలకు పాల్పడటం, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా కార్మికులను దగా చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కింది. దాదాపు మూడేండ్ల పాలనలో సింగరేణి సంస్థ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చిన కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసేందుకు బుధవారం బీఆర్ఎస్ ‘కార్మిక గర్జన’ సభ నిర్వహిస్తున్నది.
సంస్థలో భారీ కుంభకోణాలు
2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు గల్లంతైన విషయం తెలిసిందే. ‘సింగరేణి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎట్ గ్యాలన్సీ’ వెల్లడించిన అధికారిక గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే.. ఈ విషయంలో భారీగా ఫ్రాడ్ జరిగినట్టు తెలుస్తున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు గల్లంతైందని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల చివరి త్రైమాసికాల్లో బొగ్గు ఉత్పత్తిని ఒక ప్రణాళికా ప్రకారం కృత్రిమంగా పెంచి చూపించగా, ఈ తరహా వ్యవహారం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చరిత్రలోనే అత్యంత అసాధారణమైన, వ్యవస్థీకృత అకౌంటింగ్ మోసమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఒడిశాలోని నైని బొగ్గు గని టెండర్ల వ్యవహారంలో వచ్చిన అవినీతి ఆరోపణలు.. గతంలో సింగరేణి చరిత్రలో వచ్చినదాఖలాల్లేవు. ఈ విషయంలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే నిబంధన పెట్టి తమ వారికే టెండర్ వచ్చేలా అధికార పార్టీ చక్రం తిప్పింది. ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ బట్టబయలు చేయడంతో చివరికి టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ టెండర్లో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనకు బాధ్యులెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని, మరోసారి సింగరేణిలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కార్మికుల నుంచి డిమాండ్ రావడంతో.. నైని బొగ్గు గని టెండర్ల వ్యవహారంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి స్పందించారు.
ఆ మేరకు బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రదీపరాజ్ నయన్ ఇద్దరు సభ్యులతో కూడిన సాంకేతిక కమిటీ నియమించారు. టెండర్ నోటీస్‌ను విశ్లేషించి.. టెండర్ రద్దుకు కారణాలేమిటి? బొగ్గు ఉత్పత్తి కోసం ఇతర కోల్ కంపెనీలు అనుసరించే పద్ధతులేమిటి? సైట్ విజిట్ సర్టిఫికెట్‌ను ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తదితర వివరాలపై విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక అందించాలని కేంద్రం ఆదేశించింది. దేశ వ్యాప్తంగా దుమారం రేపిన నైని బొగ్గు గని టెండర్ల వ్యవహారంలో సాంకేతిక కమిటీ ఇచ్చే నివేదిక ద్వారా.. అక్రమార్కుల భరతం పడుతారని భావించినా నేటి వరకు ఆ నివేదిక బయటకు వచ్చిన దాఖలాల్లేవు. నిశితంగా పరిశీలిస్తే.. సింగరేణి గనులను ‘హస్త’గతం చేసుకోవాలన్న లక్ష్యంతోనే ముఖ్యనేత అనుచరులు వేసిన స్కెచ్ నుంచి పుట్టుకొచ్చిందే.. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన అని అర్థమవుతున్నది.
అందుకోసం టెండర్ విధానాలను పక్కనపెట్టి.. నిబంధనలకు పాతరేసి, కొత్త నిబంధనను తెచ్చి అడ్డుపెట్టి, ఆధిపత్యం చెలాయిస్తూ కోట్లు కొల్లగొట్టారన్న విమర్శలూ వచ్చాయి. నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ (ఎన్ఐటీ) నిబంధనల్లో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే నిబంధనను కొత్తగా చేర్చి, ‘హస్తం’ పార్టీకి చెందిన ముఖ్యనేత బామ్మర్ది సింగరేణి మొత్తాన్ని ఆయన కబంధ హస్తాల్లోకి తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. 2025 ఏప్రిల్ 21న ఈ నిబంధనను అమల్లోకి తెచ్చారు. నిజానికి ఎన్ఐటీలో ఒక క్లాజ్ (నిబంధన ) మార్చాలంటే ముందుగా చాలా అధ్యయనం జరగాలి. కానీ, అవేవీ లేకుండానే చేయడం విమర్శలకు దారి తీసింది. సింగరేణి సంస్థ నిధులను ఇష్టానుసారం వాడి శఠగోపం పెట్టిన కాంగ్రెస్ సర్కార్, ఓ అధికార పార్టీ బడానేత బంధువు కాంట్రాక్టు సంస్థ పెనాల్టీ రూపంలో సింగరేణికి చెల్లించాల్సిన రూ.25 కోట్లను మినహాయింపు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిన తీరు అప్పట్లో సంచలనం సృష్టించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

