హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా బుధవారం దేశ రాజధానిలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వేసిన తొలి అడుగుకు సర్వత్రా హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ శుభారంభంతో ఢిల్లీ ఎర్రకోట వరకు గులాబీ పరిమళాలు వ్యాపించాయి. దేశ రాజకీయాలలో 42 ఏండ్ల తర్వాత ఒక కొత్త జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పురుడు పోసుకొన్న సందర్భం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోనున్నది. సామాన్యుడు మొదలుకొని బుద్ధి జీవులు, రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల వరకు సర్వత్రా బీఆర్ఎస్ పట్ల సానుకూల స్పందన వ్యక్తమైంది. బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు మేధోమథనం నుంచి జీవం పోసుకొన్న బీఆర్ఎస్, మున్ముందు జాతీయ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలకనున్నదని బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన వివిధ పార్టీల నాయకులు అన్నారు. ప్రారంభోత్సవ వేడుకకు జాతీయ మీడియా అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ‘ఈ వేడుకను కండ్లారా చూడాలన్న కుతూహలంతో ఢిల్లీకి వచ్చాను. 8 ఏండ్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అమితంగా కృషి చేసిన కేసీఆర్, అదే స్ఫూర్తితో దేశ గతిని మార్చడానికి ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుకొంటున్నాను’ అని పొన్నుస్వామి అనే వ్యక్తి వ్యాఖ్యానించారు. ‘సామాన్య ప్రజల గురించి, రైతుల సమస్యల గురించి కేసీఆర్ లేవనెత్తిన అంశాలను చూస్తే, ఈ దేశానికి ఆయన నాయకత్వం అవసరం’ అని ఫారూఖీ అనే కార్యకర్త అభిలషించారు.
‘బీఆర్ఎస్’ కార్యాలయం ప్రారంభోత్సవంపై శీర్షికలు
టైమ్స్ ఆఫ్ ఇండియా (డిజిటల్, టీవీ): తెలంగాణ సీఎం కేసీఆర్ ఇనాగరేట్స్ పార్టీ ఆఫీస్ ఇన్ ఢిల్లీ.
జీన్యూస్ (డిజిటల్, టీవీ): తెలంగాణ సీఎం కేసీఆర్ ఇనాగరేట్స్ భారత రాష్ట్ర సమితి ఆఫీస్ ఇన్ ఢిల్లీ, అఖిలేశ్ యాదవ్ అటెండ్స్ ఎమాంగ్ లీడర్స్.
ఇండియా టుడే (డిజిటల్, టీవీ): బీఆర్ఎస్ మిషన్ 2024 బిగిన్స్: కేసీఆర్ ఇనాగరేట్స్ పార్టీ ఆఫీస్ ఇన్ ఢిల్లీ.
ఎన్డీటీవీ (డిజిటల్, టీవీ): కేసీఆర్ భారత రాష్ట్ర సమితి, నౌ ఏ నేషనల్ పార్టీ, ఓపెన్స్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ.
న్యూస్18 (డిజిటల్, టీవీ): తెలంగాణ సీఎం కేసీఆర్ ఇనాగరేట్స్ బీఆర్ఎస్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ.
ది హిందూ: కేసీఆర్ ఇనాగరేట్స్ భారత రాష్ట్ర సమితి పార్టీ ఆఫీస్ ఇన్ ఢిల్లీ.
దక్కన్ హెరాల్డ్: కేసీఆర్ ఓపెన్స్ బీఆర్ఎస్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ, ఫోరేస్ ఇన్‌టూ నేషనల్ పాలిటిక్స్.
మనీకంట్రోల్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇనాగరేట్స్ బీఆర్ఎస్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ.
న్యూస్‌మినిట్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇనాగరేట్స్ బీఆర్ఎస్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ.
అవుట్‌లుక్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇనాగరేట్స్ బీఆర్ఎస్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ.
ది ప్రింట్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇనాగరేట్స్ బీఆర్ఎస్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ.
స్టేట్స్‌మన్:విత్ న్యూ అడ్రస్ఇన్ న్యూఢిల్లీ, కేసీఆర్పార్టీ బీఆర్ఎస్ గెట్స్ న్యూ సాంగ్.
న్యూస్‌రూమ్ ఒడిశా: కేసీఆర్ ఓపెన్స్ బీఆర్ఎస్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ, ఫోరేస్ ఇన్‌టూ నేషనల్ పాలిటిక్స్.
పీటీఐ: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇనాగరేట్స్ బీఆర్ఎస్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ.
రిపబ్లిక్ వరల్డ్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇనాగరేట్స్ పార్టీ ఆఫీస్ ఇన్ ఢిల్లీ.
సియాసత్: కేసీఆర్ లాంచెస్ బీఆర్ఎస్ నేషనల్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ.
ది వీక్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇనాగరేట్స్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఇన్ ఢిల్లీ.
యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా: తెలంగాణ సీఎం ఇనాగరేట్స్ బీఆర్ఎస్ ఆఫీస్ ఇన్ న్యూఢిల్లీ.
ఏబీపీన్యూస్ (హిందీ): సీఎం కేసీఆర్ నే ఢిల్లీ మే కియా బీఆర్ఎస్ కే రాష్ట్రీయ్ కార్యాలయ్ కా ఉద్ఘాటన్, అఖిలేశ్ యాదవ్ ఔర్ కుమారస్వామి సమేత్ యే నేతా రహే మౌజూద్.
అమర్ ఉజాలా (హిందీ): కేసీఆర్ నే కియా భారత రాష్ట్ర సమితి కే ఢిల్లీ దఫ్తర్ కా ఉద్ఘాటన్, అఖిలేశ్-కుమారస్వామి బీ పహుంచే.
ట్విట్టర్లో ‘#బీఆర్ఎస్’ ట్రెండింగ్
బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి జాతీయ మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. పలు జాతీయ ఇంగ్లిష్, హిందీ న్యూస్సైట్లతో పాటు వివిధ భాషలకు చెందిన న్యూస్ వెబ్సైట్లు బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ప్రముఖంగా ప్రచురించగా, పలు జాతీయ న్యూస్ చానల్స్ హెడ్‌లైన్స్‌లో ప్రసారం చేశాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా (డిజిటల్, టీవీ), జీన్యూస్ (డిజిటల్, టీవీ), ఇండియా టుడే (డిజిటల్, టీవీ), ఎన్డీటీవీ (డిజిటల్, టీవీ), న్యూస్18 (డిజిటల్, టీవీ), ది హిందూ, దక్కన్ హెరాల్డ్, మనీకంట్రోల్, న్యూస్‌మినిట్, అవుట్‌లుక్, ది ప్రింట్, స్టేట్స్‌మన్, న్యూస్‌రూమ్ ఒడిశా, పీటీఐ, రిపబ్లిక్ వరల్డ్ (డిజిటల్, టీవీ), సియాసత్, ది వీక్, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, ఏబీపీ న్యూస్, అమర్ ఉజాలా వంటి సంస్థలు బీఆర్ఎస్ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చాయి. సోషల్‌మీడియాలో ‘బీఆర్ఎస్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో కొనసాగింది. బీఆర్ఎస్కు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.