KTR | తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్సే కారణం : కేటీఆర్
KTR | తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నీళ్లు, బొగ్గు లేని రాయలసీమలో, బొగ్గు లేని విజయవాడలో థర్మల్ పవర్ కేంద్రాలు నెలకొల్పుతారు. తెలంగాణలో ఆ రోజు విద్యుత్ కేంద్రాలు కట్టకుండా, రాష్ట్రం ఏర్పడే నాటికి 27 వందల మెగావాట్ల లోటు నష్టాలతో తమకు అప్పజెప్పారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నీళ్లు, బొగ్గు లేని రాయలసీమలో, బొగ్గు లేని విజయవాడలో థర్మల్ పవర్ కేంద్రాలు నెలకొల్పుతారు. తెలంగాణలో ఆ రోజు విద్యుత్ కేంద్రాలు కట్టకుండా, రాష్ట్రం ఏర్పడే నాటికి 27 వందల మెగావాట్ల లోటు నష్టాలతో తమకు అప్పజెప్పారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో విద్యుత్ రంగ పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
55 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, నిర్వాకాన్ని వైట్ పేపర్లో చాలా గొప్పగా స్పష్టంగా చెప్పింది. మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే 2014 నాటికి ఆరు గంటల కరెంట్ మాత్రమే ఇచ్చామని, అంతటి అసమర్థత, చేతకానితనం మాది అని వారే ఒప్పుకున్నారు అని కేటీఆర్ తెలిపారు. కడపలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం పెట్టారు. అక్కడ బొగ్గు ఉందా..? నీళ్లు ఉన్నాయా..? విజయవాడలో బొగ్గు ఉందా..? ఇవాళ బాగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఆ రోజు విద్యుత్ కేంద్రాలు కట్టకుండా, రాష్ట్రం ఏర్పడే నాటికి 27 వందల మెగావాట్ల లోటు నష్టాలతో తమకు అప్పజెప్పారు.
తెలంగాణ బిడ్డలుగా గట్టిగా కొట్లాడినం..
మానకొండూరు నియోజకవర్గంలోని నేదునూరు, చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని భూసేకరణ చేశారు. టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక్క దగ్గర ధర్నా చేయలేదు. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న గ్యాస్ ఆధారిత కేంద్రాలు ఎందుకు పెట్టడం లేదు అని నిరసన వ్యక్తం చేశాం. బొగ్గు లేని విజయవాడలో థర్మల్ పవర్ కేంద్రం ఎందుకు పెడుతారు..? బొగ్గు, నీళ్లు లేని రాయలసీమలో ఎందుకు పెడుతారు..? అని నాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ బిడ్డలుగా గట్టిగా కొట్లాడినం. నిరసనలు వ్యక్తం చేశాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆ రెండు ప్రాజెక్టులను ఇప్పుడు టేకాఫ్ చేయండి..
ఈ దేశంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా..? నేదునూరులో గ్యాస్ అలాకేషన్ అయిందా..? ఆనాడు యూపీఏలో జైపాల్ రెడ్డి పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండి, గ్యాస్ అలాకేషన్ చేయలేదు. గ్యాస్ అలాకేషన్ చేయలేదు కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదు. ఇప్పుడు టేకాఫ్ చేయండి మీది ప్రభుత్వం. నేదునూరు, శంకర్‌పల్లిలో ఇప్పుడు ఆ ప్రాజెక్టులు పెడుతామని ప్రభుత్వం హామీ ఇవ్వాలి. ఇవాళ నోటికొచ్చినట్టు అవమానిస్తున్నారు. అక్కడ అక్బరుద్దీన్ ఒవైసీని, ఇక్కడ మేం మాట్లాడుతుంటే మమ్మల్ని సీఎం అవమానిస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

