Telangana | అప్పులు కాదు.. ఆర్థిక ప్రగతి.. కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితా విడుదల చేసిన బీఆర్ఎస్
Telangana | కాసేపట్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
Telangana | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులకు చెక్ పెట్టే ఉద్దేశ్యంతో ఈ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడించింది.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. ప్రభుత్వ శ్వేతపత్రానికి ధీటుగా కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడానికి ముందే.. బీఆర్ఎస్ ఈ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది.
ఆర్థిక స్థితిపై పోస్ట్‌మార్టం!
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పు ల కుప్పగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తర్వాత కూడా పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఈ నెల 8న మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. శ్వేతపత్రం తయారీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇందులో దాదాపు 20 మంది ఉన్నట్టు సమాచారం. ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, ఆర్థిక రంగ నిపుణులు, పలువురు ప్రస్తుత, రిటైర్డ్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నట్టు తెలిసింది. వీరంతా కొన్ని రోజులుగా తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయ వ్యయా లు, నిధుల సమీకరణ, కేటాయింపు తదితర అంశాలపై లోతుగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న అప్పులు, కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారెంటీల లెక్కలను ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. దీంతోపాటు శాఖల వారీగా సమగ్ర వివరాల నివేదికలు వారి వద్దకు చేరాయి. ఏ ఏడాది.. ఏ పథకం కింద.. ఎంత మేరకు నిధులు మంజూరయ్యాయి? ఎంత వినియోగించారు? ఏవైనా నిధులను మళ్లించారా? వంటి వివరాలపై ఆరా తీశారు. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టొచ్చనే కోణంలో తీవ్ర చర్చలు జరిపిన అనంతరం.. ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. ఈ శ్వేతపత్రాన్ని ప్రభు త్వం బుధవారం అసెంబ్లీలో విడుదల చేయనున్నది. శ్వేతపత్రాన్ని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టి, వివరాలను తెలియజేస్తారా? లేదా సీఎం రేవంత్‌రెడ్డి సభ ముందు ఉంచుతారా? అనే చర్చ జరుగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

