కోదండరెడ్డివి సిగ్గుమాలిన మాటలు
ఖమ్మం జిల్లా చింతకానిలో ఆత్మహత్య చేసుకున్న రైతు గురించి కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి సిగ్గుమాలిన మాటలు మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మండిపడ్డారు.
- ఆత్మహత్య చేసుకున్న రైతుపై తప్పుడు ప్రచారం
- నిందితుడు భట్టి అనుచరుడనే అరెస్ట్ చేస్తలేరు
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఫైర్
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లా చింతకానిలో ఆత్మహత్య చేసుకున్న రైతు గురించి కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి సిగ్గుమాలిన మాటలు మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మండిపడ్డారు. ఆ రైతు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి అని మాట్లాడటం విడ్డూరంగా ఉందని, రైతు ప్రభాకర్ స్వయంగా తాను కాంగ్రెస్‌కు ఓటేశానని చెప్పారని అది కోదండరెడ్డికి వినిపించలేదా అని ప్రశ్నించారు.
తెలంగాణభవన్‌లో గురువారం తాతా మధుసూదన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతు ప్రభాకర్ ఆత్మహత్య కేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అనుచరుడు ప్రధాన నిందితుడని, ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. మొదటి నిందితుడుగా ఉన్న భట్టి అనుచరుడిని 8వ నిందితుడుగా ఎలా మార్చుతారని ప్రశ్నించారు.
అతను భట్టికి చాలా దగ్గరి వ్యక్తి అని, జడ్పీటీసీ భర్త కూడా అని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు తప్ప ఇంకోటి కనిపించడం లేదని, రాష్ట్రంలో ప్రజావాణికి వెళ్లి మరీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్‌లో నిన్న ఒకరు ప్రజావాణికి వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. ప్రథమ ముద్దాయిగా ఉన్న కిశోర్‌పై కేస్ నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని,
రైతు ప్రభాకర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, రైతు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులను వెంటనే అకడ నుంచి బదిలీ చేయాలని డిమాండ్‌చేశారు. పాలనను గాలికి వదిలేసి సీఎం, మంత్రులు ఢిల్లీకి చకర్లు కొడుతున్నారని దుయ్యబట్టారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందడం లేదని, వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో జూన్‌లోనే రైతుబంధు పడేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో జూలై వచ్చినా దికులేదని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

