MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారు.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
MLC Kavitha | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దుశ్చర్య వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించారు అని ఆమె అన్నారు.
నేషనల్ మీడియా ఏఎన్ఐతో కవిత మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆమె పేర్కొన్నారు. ఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు. ఇది యూనివర్సిటీ భూమి అని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళవద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసింది. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 397 ఎకరాలను ఇతర చోట యూనివర్సిటీకి ఇచ్చామని ప్రభుత్వం వితండవాదం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటు, భూముల విక్రయం ఆ 397 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా..? ప్రభుత్వం పర్యావరణం, ప్రకృతి కోణంలో కూడా ఆలోచించాలి అని కవిత సూచించారు.
ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ లాగా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయితే వాతావరణంపై ఎంత ఒత్తిడి పెరుగుతుందో ఆలోచించాలి. బీఆర్ఎస్ హయాంలో మై హోమ్ విహంగ నిర్మాణానికి భూములు కేటాయించామనడంలో వాస్తవం లేదు. మై హోమ్ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాలి. కానీ మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ మనిషి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయలేరు. పేదలు, మూగజీవులు ఉంటేనేమో బుల్డోజర్లను ప్రయోగిస్తారు… పెద్దవాళ్లనేమో ముట్టుకోరు అని కవిత మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

