సర్కార్ నిర్లక్ష్యంతోనే ఎల్ నినో సంక్షోభం
రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు, ఎల్ నినో పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం, నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన మానవ తప్పిదమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
- క్యాబినెట్ సబ్ కమిటీ కంటితుడుపు చర్య
- 23 ప్రశ్నలతో దాసోజు బహిరంగ లేఖ
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు, ఎల్ నినో పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం, నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన మానవ తప్పిదమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. వాతావరణశాఖ ఏప్రిల్‌లోనే హెచ్చరించినప్పటికీ ఆరు నెలలపాటు నిద్రపోయిన ప్రభుత్వం, వర్షాకాలం ముగిసి పంటలు ఎండిపోయాక జీవో నంబర్ 1523 ద్వారా క్యాబినెట్ సబ్ కమిటీని వేయడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. కేసీఆర్‌పై రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేస్తూ 1,000 టీఎంసీలకు పైగా ప్రాణహిత వరద నీటిని సముద్రంపాలు చేశారని, విద్యుత్తు డిమాండ్‌ను సరిగ్గా అంచనా వేయలేక అధిక రేట్లకు కొనుగోలు చేస్తూ రోజుకు రూ.42.92 కోట్ల ప్రజాధనాన్ని తగలేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సబ్ కమిటీ సభ్యులకు 23 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను సంధించారు.
జీవో నం. 1523లో నివేదిక సమర్పించడానికి ఎటువంటి గడువుగానీ, కరువు సహాయక చర్యల కోసం బడ్జెట్‌గానీ కేటాయించలేదని, జలాశయాలు అడుగంటి తీవ్ర నీటిఎద్దడి నెలకొన్న తరుణంలో జిల్లాలకు కేవలం రూ. కోటి కేటాయించడం సిగ్గుచేటని శ్రవణ్ పేరొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లను ఉంచారు. సబ్ కమిటీకి 15 రోజుల గడువు విధించి తగిన నిధులు సమకూర్చాలని, కరువు పరిస్థితులపై చర్చించేందుకు వెంటనే ఉభయ సభల ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి రూ. 20,000 కోట్ల అత్యవసర సప్లిమెంటరీ బడ్జెట్‌ను ఆమోదించాలని కోరారు. అలాగే కరువు ఖర్చులు, నీటి వృథా, విద్యుత్ కొనుగోళ్లపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు, పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

