ఆత్మగౌరవ భవనాలపై చీకటి జీవో
‘బీసీలపై వ్యతిరేకతతోనే ఆత్మగౌరవ భవనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి జీవో-14 తెచ్చింది. ఆ భవనాలపై సర్కార్ పెత్తనం చేసేందుకు కుట్రలు చేస్తున్నది’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ నుంచే ఈ చీకటి జీవో రావడం, ఆ శాఖ మంత్రి అయిన బీసీ బిడ్డ పొన్నం మౌనం వహించడం దుర్మార్గమని ఖండించారు.
- బీసీలను అణచి వేసేందుకే జీవో 14
- సర్కార్ నిర్ణయం బీసీలకు శరాఘాతం
- ఆ జీవో రద్దుచేసేదాకా బీఆర్ఎస్ పోరు
- సమైక్యవాదుల కనుసన్నల్లో రేవంత్ పాలన
- మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తేతెలంగాణ): ‘బీసీలపై వ్యతిరేకతతోనే ఆత్మగౌరవ భవనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి జీవో-14 తెచ్చింది. ఆ భవనాలపై సర్కార్ పెత్తనం చేసేందుకు కుట్రలు చేస్తున్నది’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ నుంచే ఈ చీకటి జీవో రావడం, ఆ శాఖ మంత్రి అయిన బీసీ బిడ్డ పొన్నం మౌనం వహించడం దుర్మార్గమని ఖండించారు.
నాడు బీసీల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నగరం నడిబొడ్డున తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల విలువైన స్థలాలను ఇచ్చారని కొనియాడారు. కానీ ఆ భవన నిర్మాణాలకు నిధులివ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం పెత్తనం సాగించాలని చూడటం శోచనీయమని పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే జీవో 14 రద్దు చేసేదాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. సమైక్య పాలనలో కంటే రేవంత్ హయాంలోనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సమైక్యవాదుల కనుసన్నల్లోనే రేవంత్ ప్రభుత్వం నడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలో రాష్ట్రంలో చేతగాని సర్వభ్రష్ట ప్రభుత్వం కొనసాగుతున్నదని నిప్పులు చెరిగారు.
కిరణ్కుమార్రెడ్డిలాగా రేవంత్ అవహేళన: గంగుల
‘బీసీల ఆత్మగౌరవంపై రేవంత్ ప్రభుత్వం దాడి చేస్తున్నది. ఇందులో భాగంగానే జీవో 14ను జారీచేసింది’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ భవనాలకు స్థలాలివ్వమంటే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెకిలిగా నవ్వి అవహేళన చేశారని, ఇప్పుడు సీఎం రేవంత్ సైతం అదేవిధంగా వ్యవహరిస్తూ బీసీలను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు.41 బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలకు రూ.4 వేల కోట్ల విలువైన స్థలాలతో పాటు రూ.97.5కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. ఇందులో భాగంగా జీవో-189 ఇచ్చి బలహీనవర్గాల ఆత్మగౌరవాన్ని పెంపొదించారని ప్రశంసించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనవర్గాల హక్కులను కాలరాస్తున్నదని దుయ్యబట్టారు. వెంటనే జీవో 14 రద్దుచేయాలని డిమాండ్ చేశారు. లేదంటే త్వరలోనే చలో కోకాపేట కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు.
కత్తి రేవంత్‌ది.. పొడిచేది పొన్నం ప్రభాకర్: ఎమ్మెల్సీ దాసోజు
బీసీలపై కాంగ్రెస్ సర్కార్ కర్రపెత్తనం సాగించేందుకు యత్నిస్తున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. మనదేశం కులాల సమాహారం అని చెప్పిన మారోజు వీరన్న స్ఫూర్తితో కేసీఆర్ బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.4 వేల కోట్ల విలువైన స్థలాలిచ్చారని గుర్తుచేశారు. కానీ బలహీనవర్గాల అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకే రేవంత్‌రెడ్డి జీవో-14 జారీచేశారని ఆరోపించారు. కత్తి రేవంత్రెడ్డిదైతే పొడిచేది మాత్రం బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ అని నిప్పులు చెరిగారు.
బీసీల ఆత్మగౌరవ నిర్మాణానికి నియమించిన సెలక్షన్ కమిటీలో ఒక్క బీసీ బిడ్డకు చోటు దక్కలేదని, ఈ వ్యవహారం సర్కార్ నిబద్ధతకు అద్దం పడుతున్నదని విమర్శించారు. ఆత్మగౌరవ భవనాల్లో రాజకీయ సమావేశాలు పెట్టుకోవద్దని ప్రభుత్వం హుకుం జారీ చేయడం, బీసీ కమిటీలను రద్దుచేసే అధికారాన్ని పొందడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. బీసీ వ్యతిరేక సర్కార్ తీరుకు నిరసనగా జీవో 14 కాపీలను చింపివేశారు. ఈ చీకటి ఉత్తర్వులు రద్దుచేయకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆత్మగౌరవ స్థలాలపై రేవంత్ కన్ను: విప్ వివేకానంద
సీఎంగా రేవంత్‌రెడ్డి గద్దెనెక్కినప్పటి నుంచి కనపడ్డ భూములను కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారని విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేసీఆర్ కేటాయించిన స్థలాలను అమ్ముకొనేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భూములు అమ్ముతూ ఢిల్లీకి మూటలు మోస్తున్న ముఖ్యమంత్రి.. బలహీనవర్గాలను మోసం చేసేందుకే ఈ కుటిల పన్నాగం పన్నారని ధ్వజమెత్తారు. వెంటనే చీకటి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

