జనగామ రూరల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కన్నేపల్లి పర్యటనకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తున్న సందర్భంగా జనగామ(Janagama) జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే జిల్లా నాయకుల ఇండ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. జనగామ జిల్లా పెంబర్తి వద్ద కేటీఆర్‌ను అడ్డుకోవడం కోసం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై ఇటు ప్రజలు, అటు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jn