Vasudeva Reddy | అధికారంలోకి వచ్చాక.. ఒక్క కొత్త నోటిఫికేషన్ అయినా ఇచ్చారా..? బల్మూర్ వెంకట్‌కు వాసుదేవా రెడ్డి సూటి ప్రశ్న
Vasudeva Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది.. ఈ ఆరు నెలల వ్యవధిలో నిరుద్యోగులకు ఒక్క కొత్త నోటిఫికేషన్ అయినా ఇచ్చారా..? అని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్‌ను బీఆర్ఎస్ నేత కే వాసుదేవా రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
Vasudeva Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది.. ఈ ఆరు నెలల వ్యవధిలో నిరుద్యోగులకు ఒక్క కొత్త నోటిఫికేషన్ అయినా ఇచ్చారా..? అని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్‌ను బీఆర్ఎస్ నేత కే వాసుదేవా రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో వాసుదేవా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాజీ మంత్రి హరీష్ రావు గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని మాత్రమే హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ఎటు పోయింది. జాబ్ క్యాలెండర్ ఏమైంది..? అసెంబ్లీ ఎన్నికల్లో నిరుగ్యోగులను రెచ్చగొట్టి వారి కోసం మ్యానిఫెస్టో పెట్టిన మీరు ఈ రోజు ఆ అంశాలపై మాట్లడరెందుకు? బల్మూర్ వెంకట్‌తో చర్చకు హరీష్ రావు కాదు నేను వస్తా.. నిరుద్యోగుల డిమాండ్లపై చర్చిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటినా నిరుద్యోగులకు ఒక్క కొత్త నోటిఫికేషన్ అయిన ఇచ్చారా..? మీరు అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగులు ఇచ్చారో చర్చకు సిద్ధమా..? అని వాసుదేవా రెడ్డి సవాల్ విసిరారు.
గ్రూప్స్ ఉద్యోగాల్లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే.. వారిని కొంతమంది కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నట్లు నిరుద్యోగులు వాపోతున్నారు. ఖబడ్డార్ కాంగ్రెస్ నాయకుల్లారా నిరుద్యోగుల జోలికి వస్తే ఊరుకోము. హరీష్ రావు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలు సమస్యల కోసం వచ్చే వారికి భోజనం పెట్టి సమస్య పరిష్కరించేవారు. హరీష్ రావు 14 ఏండ్లు ఉద్యమం, 10 ఏండ్లు అధికారంలో ఉన్న నిఖార్సయిన ఉద్యమకారుడి గురించి మాట్లాడే స్థాయి వెంకట్‌ది కాదు. పెద్దల సభకు వెళ్లిన బల్మూర్ వెంకట్ తన స్థాయి దిగజారి మాట్లాడొద్దు. వెంకట్ ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉంది.
ఏదీ పడితే అది మాట్లాడితే ఊరుకోము. నిరుద్యోగుల పక్షాన మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి తప్ప పిచ్చిగా మాట్లడి పెద్ద వాళ్ళను విమర్శిస్తే పెద్ద వాళ్ళు కారు అని వాసుదేవా రెడ్డి మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

