BRS MLC Satyavathi Rathode | బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కుతోనే కవిత అరెస్ట్..మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్
BRS MLC Satyavathi Rathode | బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కైందువల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు జరిపారని బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ ఆరోపించారు.
BRS MLC Satyavathi Rathode | బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కైందువల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు జరిపారని బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిలో సోదాలు, అటుపై ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై ఆమె స్పందించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉండగా, ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలన్నారు.
ఇన్ని రోజులు పట్టించుకోకుండా పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడమేమిటని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. ఈడీ అధికారులు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బలహీన పరిచేందుకు ప్రధాని నరేంద్రమోదీ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరని పేర్కొన్నారు. దీనిపై ప్రజాక్షేత్రంలో రాజకీయంగానే ఎదుర్కొంటామని చెప్పారు. చట్టపరంగా న్యాయస్థానాల్లోనూ పోరాడతామన్నారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

