Manne Krishank | తనకు తెలియకుండానే అనుమతులు ఇచ్చారనడం హాస్యాస్పదం.. జూపల్లి వ్యాఖ్యలపై క్రిశాంక్ సీరియస్
Manne Krishank | రాష్ట్రంలో సోమ్ డిస్టిల్లరీస్ కంపెనీకి బేవరేజెస్ కార్పొరేషనే అనుమతులు ఇచ్చిందని.. ఆ కార్పొరేషన్ కార్యకలాపాలు తన దృష్టికి రావంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.
Manne Krishank | రాష్ట్రంలో సోమ్ డిస్టిల్లరీస్ కంపెనీకి బేవరేజెస్ కార్పొరేషనే అనుమతులు ఇచ్చిందని.. ఆ కార్పొరేషన్ కార్యకలాపాలు తన దృష్టికి రావంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. నకిలీ మద్యానికి పేరుగాంచిన సోమ్ డిస్టిల్లరీస్ కంపెనీ తెలంగాణలో వ్యాపారం మొదలుపెడుతుంటే కనీసం సమాచారం లేదని అనడం బాధ్యతారహితమని విమర్శించారు. ఈ నకిలీ మద్యంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు.
సోమ్ డిస్టిల్లరీస్ కంపెనీకి అనుమతులు ఇవ్వడం పట్ల సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ నకిలీ మద్యం సంస్థకు సంబంధించిన మద్యం అమ్మకాలకు సంబంధించిన అనుమతులను నిలిపివేయాలన్నారు. జూపల్లి కృష్ణారావు మంత్రిగా కొనసాగితే ఈ విచారణపై రాజకీయ ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుందని.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్ నుంచి జూపల్లిని బర్తరఫ్ చేయాలని కోరారు. లేదంటే ఈ ఒప్పందం వెనుక కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని భావించాల్సి వస్తుందని చెప్పారు. ఈ మేరకు క్రిశాంక్ ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు.
ఆ వీడియోలో క్రిశాంక్ ఏం చెప్పారంటే..
21 మే 2024 గాంధీభవన్ లో ప్రెస్ సమావేశం పెట్టి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఎలాంటి మద్యం కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పారు. పైగా అలా ప్రచారం చేసే మీడియా సంస్థలపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తారని బెదిరించారు.
27 మే… pic.twitter.com/AM5l4jZDm8
— BRS Party (@BRSparty) May 29, 2024
21 మే 2024 గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎలాంటి మద్యం కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పారు. పైగా అలా ప్రచారం చేసే మీడియా సంస్థలపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తారని బెదిరించారు.
27 మే 2024న బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అబద్ధాన్ని బహిర్గతం చేస్తూ Som Distilleries అనే సంస్థకు అనుమతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడంపై మీడియా సమావేశం పెట్టింది. దీనికి జవాబుగా మంత్రి జూపల్లి కృష్ణారావు మే 28న పత్రిక లేఖ విడుదల చేసి Som Distilleries అనే సంస్థకు అనుమతులు ఇవ్వడం వాస్తవమే అని ఒప్పుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారని జూపల్లి కృష్ణారావు మరిచినట్టున్నారు. నకిలీ మద్యానికి పేరుగాంచిన Som Distilleries వ్యాపార సంస్థ తెలంగాణ రాష్ట్రంలో తన వ్యాపారం మొదలు పెడుతుంటే కనీసం సమాచారం లేదని మంత్రి అనడం బాధ్యతరహితం. Som Distilleries సంస్థకు కార్పొరేషన్ వారే అనుమతులు ఇచ్చారు మంత్రికి సమాచారం లేదని తన లేఖలో పేర్కొనడం హాస్యాస్పదం.
ప్రభుత్వ ఆదాయానికి మరీ ముఖ్యంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ నకిలీ మద్యం అంశం మంత్రికి తెలియకుండానే ప్రెస్ మీట్ పెట్టి 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించి ఇప్పుడు తెలియదని చెప్పడం రాష్ట్ర ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. రేపటి దినం ఈ నకిలీ మద్యంతో రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు మంత్రి ఇలాగే తనకు సమాచారం లేదని అధికారుల మీదకి నెట్టేస్తారా? మంత్రి బాధ్యత వహించరా?
ఈ సంవత్సరం 26 ఫిబ్రవరి 2024న మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అబ్కారీ విభాగం Som Distilleries సంస్థకు నకిలీ మద్యం అమ్ముతున్నందుకు నోటీసులు ఇచ్చింది వాస్తవమే కదా, సెక్షన్లు 420, 467, 468, 471, 120 B ఆరోపణలతో సంస్థ చైర్మన్ జగదీశ్ అరోరా పై కేసు వేసి జైలుకు పంపింది వాస్తవం కదా. దీనిపై మంత్రి జూపల్లి తన లేఖలో ఎందుకు సమాధానం చెప్పలేదు?
మధ్యప్రదేశ్ ప్రభుత్వం జరిపిన SIT విచారణలో మూరేనా అనే ప్రాంతంలో నకిలీ మద్యం సేవించి 24 మంది చనిపోయినప్పుడు, విచారణలో భాగంగా తేలిన విషయం ఆ మరణాలకు కారణం నకిలీ మద్యమని Som Distilleries కు సంబంధించిన 20 స్పిరిట్ , రిసీవర్ ట్యాంకులను ప్రభుత్వం సీల్ చేసిన విషయం మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియకుండానే అనుమతులు ఇచ్చారా? ఈ విషయంపై బీఆర్ఎస్ ప్రశ్నించడాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు తన లేఖలో ఎందుకు సమాధానం చెప్పలేదు.
Som Distilleries నకిలీ మద్యం సంస్థ వద్ద కాంగ్రెస్ పార్టీ విరాళాలు తీసుకోవడాన్ని ఎందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించలేదు? మూడుసార్లు 25 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ Som Distilleries వద్ద తీసుకున్నది. ఒకసారి ఏకంగా ఒక కోటి 31 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి Som Distilleries నుంచి అందినయి. ఒక నకిలీ మద్యం సంస్థ అయిన Som Distilleries కు వకాల్త పుచ్చుకొని స్వయాన మంత్రి తన లేఖలో ఆ సంస్థ గొప్పతనాన్ని చెప్పడం విడ్డూరం.
వారం ముందు ఇలాంటి వ్యాపారాలు తెలంగాణ రాష్ట్రంలో వస్తలేదని చెప్పి వారం తర్వాత బీఆర్ఎస్ బయటపెట్టిన అనంతరం ఆ కంపెనీ గురించి గొప్పలు చెప్పి ఆ Som Distilleries నకిలీ మద్యం కంపెనీకి వ్యాపారం కట్టబెట్టినరంటే కాంగ్రెస్‌కు కమిషన్ ముట్టినాయని తెలుస్తుంది.
దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని అప్పటివరకు Som Distilleries అనే నకిలీ మద్యం సంస్థకు తెలంగాణ రాష్ట్రంలో వారి మద్యాన్ని అమ్మే అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం.
జూపల్లి కృష్ణారావు మంత్రిగా కొనసాగితే ఈ విచారణపై రాజకీయ ఒత్తిడి పెట్టే అవకాశం ఉంది, కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతున్నాం. లేదంటే సంస్థకు కాంగ్రెస్ పార్టీకి ఈ డీల్ కుదరడంలో సీఎం రేవంత్ పాత్ర ఉందని భావించవలసి వస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

