Raghu Babu | సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత దుర్మరణం
Raghu Babu | ప్రముఖ సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు దుర్మరణం చెందారు. నల్లగొండ పట్టణ శివారులో జరిగిన ఈ ప్రమాదంలో బీఆర్ఎస్ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు (49) కన్నుమూశారు.
Raghu Babu | ప్రముఖ సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు దుర్మరణం చెందారు. నల్లగొండ పట్టణ శివారులో జరిగిన ఈ ప్రమాదంలో బీఆర్ఎస్ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు (49) కన్నుమూశారు.
వివరాల్లోకి వెళ్తే.. నటుడు రఘుబాబు బుధవారం సాయంత్రం బీఎండబ్ల్యూ కారు (కేఏ 03 ఎంపీ 6914)లో హైదరాబాద్ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారుకు రాగానే అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై దుప్పలపల్లి రోడ్డులో ఉన్న దత్తసాయి వెంచర్‌కు బైక్‌పై వెళ్తున్న బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు(49)ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జనార్దన్‌రావు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, యాక్సిడెంట్ జరిగిన సమయంలో రఘుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు సొంత పూజీకత్తుపై విడుదల చేసినట్లు సమాచారం.
జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అందులో చురుకైన నేతగా ఎదిగారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్లో చేరారు. కిందటి మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనగర్ కాలనీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా, ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, జనార్దన్ రావు మృతి పట్ల మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

