BRS | నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలువనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేయనుంది.
- ఫిరాయింపులు, నిరుద్యోగ సమస్యలపై వినతి
BRS | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలువనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేయనుంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌ను కోరనున్నది. దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి నేతల పార్టీ ఫిరాయింపుపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసి మూడు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నది. నిరుద్యోగుల సమస్యలు, వారి పోరాటం, నమోదైన కేసులు తదితర విషయాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నది.
ఇంకా చదవల్సిన వార్తలు
ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కనీస మద్దతుధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 2018-19 నుంచి పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రైతుసాగుకు పెట్టిన పెట్టుబడికి 50శాతం కనీసం మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా సూచించిన ధర కన్నా అతితక్కువగా కనీస మద్దతు ధరను అమలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పంటల బీమా పథకం, పంట నష్టం జరిగిన 30రోజులలోపు పరిహారం చెల్లించేవిధంగా, వ్యవసాయాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకానికి అనుసంధానం చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

