KCR | పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు.. రాష్ట్రం సాధించిన మనకు గిదో లెక్కనా..? : కేసీఆర్
KCR | బీఆర్ఎస్ పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనకు గిదో లెక్కనా..? అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పార్టీ కార్యకర్తల సమావేశం శుక్రవారం కూడా కొనసాగింది.
KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనకు గిదో లెక్కనా..? అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పార్టీ కార్యకర్తల సమావేశం శుక్రవారం కూడా కొనసాగింది. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తది. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం. బీఆర్ఎస్ శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు ఒక లెక్క కాదు. ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుంది. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకునే సత్తా.. బీఆర్ఎస్కు మాత్రమే ఉంది. కొన్ని సార్లు అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు మోసపోతారు. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. మనం ఏ హోదాలో ఉన్న ప్రజల కోసం పని చేయాల్సిందే అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నాయకులు, ప్రజలతో సమావేశం కంటే ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల, హుజురాబాద్ ఎమ్మెల్యేలు డా. సంజయ్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, ఎల్ రమణ, జగిత్యాల జడ్పీ చైర్మన్ వసంత సురేష్, పెద్దపెల్లి బీఆర్ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు.
పార్టీని వీడి దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా?
పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు
నాడైనా నెడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తది
రెట్టించిన… pic.twitter.com/c4xTTySETA
— BRS Party (@BRSparty) June 28, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

