KCR | మా హయాంలో వచ్చిన కరెంటు ఇప్పుడెట్ల మాయమైంది..? : కేసీఆర్
KCR | కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాయమాటలు చెప్పిందని, తీరా అధికారంలోకి వచ్చినంక ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాలు మొదలైనయని అన్నారు.
KCR : కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాయమాటలు చెప్పిందని, తీరా అధికారంలోకి వచ్చినంక ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాలు మొదలైనయని అన్నారు. మా పాలనలో వచ్చిన కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైపోయిందని ప్రశ్నించారు.
‘మేం అధికారంలోకి రాంగనే ఆరు గ్యారంటీలకు చట్టం చేసి, చట్టబద్ధత కల్పించి అందరికీ న్యాయం చేస్తమని ఆనాడు కాంగ్రెస్ నేతలు చెప్పిండ్రు. కానీ ఏది గూడా చెయ్యలే. మరె ఏంజేస్తున్నరు వీళ్లు. ఆనాడు 24 గంటల కరెంటు వచ్చింది రైతాంగానికి. ఇప్పుడు కరెంటు వస్తుందా..? లేదంటే కరెంటు కోతలు అయితున్నాయా..?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. జనం కరెంటు వస్తలేదనడంతో ‘మరె ఏమయ్యింది కరెంటుకు..? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెప్పపాటు కూడా పోని కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైంది..?’ అన్నారు.
‘ఇదే జిల్లాలో ఒక గిరిజన గూడెం ఉంటది. పినపాక నియోజకవర్గంలో ఉంది ఆ గూడెం. బ్రహ్మాండంగా మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి ‘దొంగతోపు’ అనే ఆ చిన్న గిరిజన గూడేనికి కూడా నీళ్లు పంపినం. ఇయ్యాల అక్కడ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయా..? వస్తలేవు. అక్కడ కూడా ఇబ్బందే జరుగుతున్నది. అదేవిధంగా గిరిజన బిడ్డలకు త్రీ ఫేజ్ కరెంటు ఇవ్వాలని, అక్కడ కూడా బ్రహ్మండంగా వ్యవసాయం జరగాలని, పంటలు సక్రమంగా పండాలని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి త్రీ ఫేజ్ కరెంటు ఇప్పించినం. ఇయ్యాల అక్కడ మోటార్లు కాలుతున్నయ్. పొలాలు ఎండిపోతున్నయ్, రైతులు బాధపడుతున్నరు’ అని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS chief
- bus yatra
- KCR
- Kotthagudem
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

