నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై ఆయన 4,238 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాగా జగదీష్‌రెడ్డి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించి మంత్రిగా పనిచేశారు.