10 మంది ఫైర్ సిబ్బందికి ‘బ్రోంజ్ డిస్క్’ పురస్కారం
కేంద్ర హోంశాఖ అందించే ప్రతిష్ఠాత్మక ‘బ్రోంజ్ డిస్క్' పురస్కారానికి రాష్ట్ర అగ్నిమాపక శాఖకు చెందిన 10 మంది ఎంపికయ్యారు. ఈ మేరకు అగ్నిమాపకశాఖ ఏడీజీ విక్రమ్‌సింగ్ మాన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంశాఖ అందించే ప్రతిష్ఠాత్మక ‘బ్రోంజ్ డిస్క్’ పురస్కారానికి రాష్ట్ర అగ్నిమాపక శాఖకు చెందిన 10 మంది ఎంపికయ్యారు. ఈ మేరకు అగ్నిమాపకశాఖ ఏడీజీ విక్రమ్‌సింగ్ మాన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోమ్ గార్డ్స్ విభాగాల్లో అత్యుత్తమ విధి నిర్వహణ, అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఈ ఉన్నత స్థాయి గౌరవాన్ని అందజేస్తారని ఆయన తెలిపారు. ఈ గౌరవం సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని, ప్రజలకు మరింత నిబద్ధతతో సేవలు అందించడానికి, సమాజంలో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన పెంచడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని పేరొన్నారు.
పురసార గ్రహీతల వివరాలు: బీ సుధాకర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ (గౌలిగూడ, హైదరాబాద్), జీ యాదగిరి, లీడింగ్ ఫైర్ ఫైటర్ (సెక్రటేరియట్, హైదరాబాద్), ఎండీ గౌస్ పాషా, లీడింగ్ ఫైర్ ఫైటర్ (గద్వాల్), గడ్డే కృష్ణ ప్రసాద్, లీడింగ్ ఫైర్ ఫైటర్ (వైరా, ఖమ్మం), సారా రాజేశ్వర్, ఫైర్ ఫైటర్ టెక్నికల్ (హయత్ నగర్, రంగారెడ్డి), వగడాని రామ్ బాబు: ఫైర్ ఫైటర్ టెక్నికల్ (ఖమ్మం), కే వినోద్ కుమార్, ఫైర్ ఫైటర్ టెక్నికల్ (స్నారెల్, హైదరాబాద్), ఎం ప్రవితన్, ఫైర్ ఫైటర్ (గౌలిగూడ, హైదరాబాద్), జీ రాకేశ్ కుమార్, ఫైర్ ఫైటర్ (హైకోర్టు, హైదరాబాద్), జుట్టుకొండ వెంకటేశ్వర్లు, ఫైర్ ఫైటర్ (హుజూర్నగర్, నల్లగొండ).
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

