రాష్ట్రంలో మహిళా సంక్షేమం భేష్
మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని సోమవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో
- బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ ప్రశంస
- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌తో భేటీ
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని సోమవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి సునీతాలక్ష్మారెడ్డి ఆయనకు వివరించారు.
మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత, లింగ వివక్ష, సైబర్ క్రైం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, గృహహింస నిరోధక చట్టం తదితర మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వాట్సప్ హెల్ప్‌లైన్ 9490555533, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ @SCWTelangana ద్వారా మహిళా కమిషన్‌కి వస్తున్న ఫిర్యాదుల గురించి తెలియజేశారు. ఎన్ఆర్ఐ వివాహాల కేసులకు సంబంధించి త్వరిగతిన కొలికి తెచ్చేందుకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ సహకరించాలని కోరారు. అనంతరం గారెన్ విన్ ఓవెన్ మాట్లాడుతూ.. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

