లోకల్ టెండర్లకు బ్రేక్
ఐటీడీఏల పరిధిలోని గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు నిత్యావసర సరుకులు, కాస్మోటిక్స్ సరఫరా కోసం గిరిజన సహకారం సంస్థ (జీసీసీ) ద్వారా నిర్వహిస్తున్న టెండర్లకు గిరిజన సంక్షేమ శాఖ బ్రేక్ వేసింది.
ఏటూరునాగారం, జూన్ 12 : ఐటీడీఏల పరిధిలోని గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు నిత్యావసర సరుకులు, కాస్మోటిక్స్ సరఫరా కోసం గిరిజన సహకారం సంస్థ (జీసీసీ) ద్వారా నిర్వహిస్తున్న టెండర్లకు గిరిజన సంక్షేమ శాఖ బ్రేక్ వేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 25 వేల మందిపైగా గిరిజన విద్యార్థులకు సరఫరా చేసేందుకు ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో మూడు నెలలకోసారి టెండర్లను పూర్తిచేసి వ్యాపారుల నుంచి సేకరించిన సరుకులను జీసీసీ సరఫరా చేస్తున్నది. ఇందుకు 5 శాతం వరకు జీసీసీ కమీషన్ పొందుతున్నది.
ఈ ఏడాది నుంచి రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు గిరిజన సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేయడంతో జీసీసీ టెండర్లు నిర్వహించలేదు. దీంతో పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ సరుకులు సరఫరా కాలేదు. అటు రాష్ట్ర స్థాయి కొనుగోలు కమిటీ ద్వారా ఎవరెవరు ఏమేమి సరఫరా చేయాలనేది నిర్ణయించినప్పటికీ ఆచరణలో జాప్యం కావడంతో సరుకుల సరఫరాకు మోక్షం లభించలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

