ASFBAMB | కాచిన నూనెలతో మెదడుకు ముప్పు.. క్యాన్సర్, కాలేయ వ్యాధులకు దారితీసే ప్రమాదం
కాచిన నూనెలతో మళ్లీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ, క్యాన్సర్‌తోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశమున్నదని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన ఏఎస్ఎఫ్బీఏఎంబీ (అమెరికన్ సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ) వార్షిక సమావేశంలో ఈ అధ్యయానికి సంబంధించిన నివేదికను వెల్లడించారు.
- ఏఎస్ఎఫ్బీఏఎంబీ తాజా అధ్యయనంలో వెల్లడి
ASFBAMB | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): కాచిన నూనెలతో మళ్లీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ, క్యాన్సర్‌తోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశమున్నదని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన ఏఎస్ఎఫ్బీఏఎంబీ (అమెరికన్ సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ) వార్షిక సమావేశంలో ఈ అధ్యయానికి సంబంధించిన నివేదికను వెల్లడించారు. ఈ పరిశోధనల్లో నూనెకు, మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న సమస్యల గురించి వెల్లడైంది. ఎలుకలపై పరిశోధనలు నిర్వహించినట్టు వారు తమ నివేదికలో వెల్లడించారు. కొన్ని ఎలుకలకు సాధారణ ఆహారం ఇవ్వగా, మరికొన్నింటికి కాచిన నూనెతో చేసిన ఆహారం ఇచ్చారు. ఈ రెండింటినీ పోల్చి చూస్తే.. కాచిన నూనెతో చేసిన ఆహారం తిన్న ఎలుకల్లో మెదడు అనారోగ్య ముప్పును ఎదురొన్నాయని పరిశోధకులు తెలిపారు. కాచిన నూనెతో చేసిన వంటల వినియోగంతో శారీరక సమతుల్యత దెబ్బ తింటుందని గుర్తించారు.
కీలకమైన జీర్ణ వ్యవస్థ, కాలేయాన్ని దెబ్బతీస్తుందని తేలింది. ఈ నూనె కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పలువురు ఆరోగ్య నిపుణులూ హెచ్చరిస్తున్నాన్నారు. ఇది ఫ్రీ రాడికల్స్ ముప్పు పెంచుతుందని, దీనివల్ల దేహంలో వాపు ఏర్పడి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు. ఇప్పుడు తాజా పరిశోధన కూడా వాటిని నిరూపిస్తున్నదని పరిశోధకులు వెల్లడించారు. పదే పదే వేడిచేసిన నూనెలతో చేసిన వంటలతో మనిషి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలూ పెరగుతాయని, దీర్ఘకాలిక రోగాలు వేధిస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. ఈ ప్రమాదాలను తగ్గించుకోవడానికి.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వారు పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

