చెర్వుగట్టు: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన చెర్వుగట్టు (Cheruvugattu)పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి బ్రహోత్సవాలు వైభవంగా పండువగా జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిగుండాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. అగ్నిగుండంలో నడుస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున శేషవాహనంపై స్వామివారి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సూర్య నమస్కారాలు, గవ్వంత మార్చనలు, దీక్షా, రుద్ర హోమాలు, బలిహరణ, వేద స్వస్తి, సరస్వతీ పూజ, ఏకాదశ రుద్రాభిషేకం, మహా నివేదన, నీలజన మంత్ర పుష్పం, ఆంజనేయ స్వామికి చేసిన లక్ష తమలపాకుల పూజ భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం దీక్షా హోమం, శ్రీ సూక్త హోమం, నీరాజన మంత్ర పుష్పం నిర్వహించారు.