హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌కు తరలిరాగా.. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ బాష్ (Bosch) రానున్నది. మొబిలిటీ, ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్, గృహోపకరణాలలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న బాష్ సంస్థ.. తమ బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. బాష్ సంస్థ రాకతో సుమారు 3వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.
BOSCH in Hyderabad! 😊
German MNC & a world leader in Mobility, Industrial Engineering & Home Appliances has chosen Hyderabad as a strategic location with its Bosch Global Software Technologies and R&D presence. The proposed facility will provide employment to about 3000 people pic.twitter.com/vqAWo2SUPd
— KTR (@KTRTRS) February 8, 2022