‘గూగుల్’ తల్లికి యూట్యూబ్ బోనం
గూగుల్ తల్లికి యూ ట్యూబ్ బోనాలు సమర్పించనున్నారు. దాదాపు 150 మంది యూట్యూబ్ చానల్ నిర్వాహకులు శుక్రవారం కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశమై.. ఫిబ్రవరి 5న బోనాల పండుగను మొదటిసారి వేములవాడలో నిర్వహించాలని నిర్ణయించారు. బోనాల పండుగను సంప్రదాయంగా కొనసాగిస్తామని, ఏడాదికోసారి నిర్వహిస్తామని చెప్తున్నారు.
- వేములవాడ ఆలయంలో ఫిబ్రవరి 5న బోనాల జాతర
వెయ్యి మందితో పెద్ద ఎత్తున వేడుక నిర్వహణకు నిర్ణయం
ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ ప్రతినిధుల వెల్లడి
కరీంనగర్ కమాన్ చౌరస్తా/తెలంగాణ చౌక్, డిసెంబర్ 30: గూగుల్ తల్లికి యూ ట్యూబ్ బోనాలు సమర్పించనున్నారు. దాదాపు 150 మంది యూట్యూబ్ చానల్ నిర్వాహకులు శుక్రవారం కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశమై.. ఫిబ్రవరి 5న బోనాల పండుగను మొదటిసారి వేములవాడలో నిర్వహించాలని నిర్ణయించారు. బోనాల పండుగను సంప్రదాయంగా కొనసాగిస్తామని, ఏడాదికోసారి నిర్వహిస్తామని చెప్తున్నారు.
విజయవంతం చేయండి
కళాకారులకు బతుకు దారి చూపెడుతున్న గూగుల్ తల్లికి ఫిబ్రవరి 5న వేములవాడలో బోనాలు తీస్తామని ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ (ఐటీఎఫ్) గౌరవాధ్యక్షుడు జీఎల్ నాందేవ్ తెలిపారు. కరీంనగర్‌లోని ప్రెస్ భవన్లో శుక్రవారం ప్రముఖ జానపద కళాకారుడు, కవి బుర్ర సతీశ్ అధ్యక్షతన జరిగిన ఐటీఎఫ్ కళాకారుల సమావేశంలో మాట్లాడారు. కళాకారుల జీవనోపాధికి ఆధారమవుతున్న గూగుల్ తల్లికి బోనాలను వేములవాడలో పండుగలా జరిపించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కళాకారులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

