Nallagonda | స్వగ్రామం చేరుకున్న మావోయిస్టు అగ్ర నేత పాక హనుమంతు భౌతిక కాయం.. భారీగా తరలి వచ్చిన జనం
మావోయిస్టు అగ్ర నేత( Maoist leader) పాక హనుమంతు భౌతిక కాయం(Paka Hanumanth) ఆదివారం ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చేరుకుంది.
నల్లగొండ : మావోయిస్టు అగ్ర నేత( Maoist leader) పాక హనుమంతు భౌతిక కాయం(Paka Hanumanth) ఆదివారం ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చేరుకుంది.
లోని ఆయన స్వగృహానికి చేరుకుంది. పాక హనుమంతు అంతిమ యాత్రలో మునుగోడు మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వందలాది మంది కమ్యూనిస్ట్ అభిమానులు, ఉద్యకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా, ఒడిశా రాష్ట్రం కంధమల్ జిల్లా అడవుల్లో బుధవారం చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో మావోయిస్టు సీనియర్ నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హన్మంతు అలియాస్ గణేశ్ ఉయికే(69) మృతిచెందారు. కంధమల్-గంజామ్ జిల్లాల సరిహద్దు చకపాడా సమీపంలోని రంభా ఫారెస్ట్ రేంజ్ పరిధిలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో హన్మంతుతోపాటు మరో ముగ్గురు మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
డిగ్రీలో ఉండగానే ఉద్యమంలోకి..
పాక పాపమ్మ-చంద్రయ్య దంపతులకు 1961లో హన్మంతు జన్మించారు. ఆయనకు ముగ్గురు చెల్లెండ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పుల్లెంలలో ఆయన పుట్టిన ఇల్లు పడావు పడింది. ఆయన ఒక సోదరుడు నల్లగొండలో నివాసం ఉంటుండగా సోదరీమణులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. హన్మంతు నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో డిగ్రీ బీఎస్సీ కోర్సు చదివారు. డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగానే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడై పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు.
1982లో బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతుండగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) అధ్యక్షుడిగా పనిచేశారు. అదే సమయంలో కాలేజీలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నేతలతో జరిగిన విద్యార్థి సంఘాల గొడవల్లో హన్మంతు కీలక పాత్ర వహించినట్లు తెలిసింది. ఈ క్రమంలో 1980లో నల్లగొండలో జరిగిన ఏబీవీపీ నేత ఏచూరి శ్రీనివాస హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయి అప్పటి పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరి వెనుదిరిగి చూడలేదు. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా, రాష్ట్ర స్థాయి నేతగా పేరొందారు. నాలుగున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఎన్నో ప్రధాన ఘట్టాల్లో కీలక పాత్ర పోషించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

