ఎస్సీ వర్గీకరణే లేదు
ఎస్సీ వర్గీకరణ చేసే ప్రసక్తే లేదంటూ బీజేపీ ఎస్సీమోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్‌సింగ్ ఆర్య చేసిన వ్యాఖ్యలను టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. బీజేపీ దళితుల వ్యతిరేకి అని మరోసారి తేటతెల్లం అయ్యిందని చెప్పారు.
- స్పష్టం చేసిన బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
- దళితుల పట్ల బీజేపీ వైఖరి మరోసారి తేటతెల్లం
- లాల్‌సింగ్ వ్యాఖ్యలను ఖండించిన ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ చేసే ప్రసక్తే లేదంటూ బీజేపీ ఎస్సీమోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్‌సింగ్ ఆర్య చేసిన వ్యాఖ్యలను టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. బీజేపీ దళితుల వ్యతిరేకి అని మరోసారి తేటతెల్లం అయ్యిందని చెప్పారు. ప్రధాని మోదీ మనుసులోని మాటను ఆయన బయటపెట్టారని తెలిపారు. దళితులకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమని మరోసారి స్పష్టమైందని వివరించారు.
ఇప్పటికైనా బీజేపీలో ఉన్న దళితులు ఆలోచన చేయాలని కోరారు. దళితులకు బీజేపీ అన్యాయం చేస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం గౌరవంతో బతికేలా చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 125 అడుగుల అంబేదర్ విగ్రహం ఏర్పాటుతోపాటు నూతన సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దళితబంధు వంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తున్న కేసీఆర్ గురించి బీజేపీ నేతలు పిచ్చి కూతలు కూయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే నూతనంగా నిర్మించే పార్లమెంట్‌కు అంబేదర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

