నల్లగొండ: కోతులు అంటేనే కొంటె చేష్టలకు కేరాఫ్ అడ్రస్. కోతులు చేసే కొంటె చేష్టలు అన్నీఇన్నీ కావు. చెట్ల కొమ్మలపైన దుంకులాడినా, పండ్లు కాయలను సగంసగమే తిని విసిరిపారేసినా, ఆహారం కోసం ఇండ్లలో దూరి మనుషులను ముప్పుతిప్పలు పెట్టినా అది కోతులకే చెల్లుతుంది. అందుకే మనుషుల్లో ఎవరైనా కొంటె పనులు చేస్తే కోతి చేష్టలు అని తిడుతుంటారు.
మరి అలాంటి కోతికే ఓ రెండు గోరింకలు చుక్కలు చూపించాయి. ఓ ఇంటి మీద కూర్చుని ఉన్న కోతి నెత్తిపై ఆదేపనిగా తంతూ ఆటాడుకున్నాయి. కొద్దిసేపు కోతి ఆ గోరింకలను నిలువరించే ప్రయత్నం చేసినా చివరికి తట్టుకోలేక చాటుకు వెళ్లి దాక్కోవాల్సిన పరిస్థితి కల్పించాయి. మొత్తానికి కోతికే కోతి చేష్టల రుచి చూపించాయి గోరింకలు. మరి ఆ ఫన్నీ వీడియోను మీరు కూడా ఓసారి చూసి ఎంజాయ్ చేయండి.