బిల్ గేట్స్‌తో చర్చలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్: లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్‌తో జరిగే ఈ యేటి బయోఏషియా సదస్సులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పాల్గొననున్నారు. వర్చువల్‌గా జరిగే ఆ సదస్సులో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొంటారు. ఆ సమావేశంలో లైఫ్ సైన్సెస్ గురించి గేట్స్‌తో మంత్రి కేటీఆర్ చాట్ చేయనున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి బయోఏషియా సదస్సు జరగనున్నది. కోవిడ్19 మహమ్మారి వేళ గత రెండేళ్ల అనుభవాలు.. హెల్త్‌కేర్‌లో కొత్త ట్రెండ్స్.. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై బిల్ గేట్స్, కేటీఆర్ మధ్య సంభాషణ జరగనున్నది.
రెండు రోజులు జరిగే ఈవెంట్లో జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ అలెక్స్ గోర్క్సీ, మెడ్‌ట్రానిక్ సీఈవో జెఫ్ మార్తాలు సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. బయోఏషియా సదస్సులో ప్రభావంతమైన, విజినరీ నేతలు పాల్గొంటారని, ప్రస్తుతం బయో ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పరిస్థితిపై గేట్స్‌తో ఆసక్తికరమైన చర్చ నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 19వ బయోఏషియా సదస్సులో గేట్స్ పాల్గొనబోవడం సంతోషకరమని బయోఏషియా సీఈవో శక్తి నాగప్పన్ తెలిపారు. 2021 సదస్సు అత్యంత సక్సెస్ సాధించిందని, దాంట్లో 31వేల మంది డెలిగేట్లు పాల్గొన్నట్లు జయేశ్ రంజన్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

