CM KCR | ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసిన సీఎం కేసీఆర్.. నేడు జనగామ, భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభలు
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరానికి హుస్నాబాద్‌లో శంఖారావం పూరించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ప్రచారపర్వాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.
- భారీ జన సమీకరణకు బీఆర్ఎస్ ఏర్పాట్లు
CM KCR | హైదరాబాద్/జనగామ/యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరానికి హుస్నాబాద్‌లో శంఖారావం పూరించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ప్రచారపర్వాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. సోమవారం జనగామ, భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని, భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డిని గెలిపించాలని ఆయన అభ్యర్థించనున్నారు. జనగామలోని మెడికల్ కాలేజీ మైదానంలో ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు, రెండు పట్టణాల నుంచి లక్షకుపైగా జనం తరలివచ్చేలా ఏర్పాట్లు పూర్తిచేశారు.
సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా జనగామలోని సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకొంటారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. జనగామ సభ ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. వేదికను, సభా ప్రాంగణంతోపాటు హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా రెయిన్ ప్రూఫ్ స్టేజీ వేశారు. బహిరంగ సభ నేపథ్యంలో భువనగిరి పట్టణం గులాబీమయంగా మారింది. జనం ఇబ్బందులు పడకుండా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు 60 వేల మందికి పైగా జనం రానున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. రెండో చోట్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

