రాహుల్.. జవాబ్‌దో.. చెప్పిన మాటలెన్ని? చేసినవెన్ని? మ్యానిఫెస్టో ధోకాపై మౌనమేనా?
ఎన్నికల్లో ఎప్పుడంటే అప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. అర్ధరాత్రి వేళ అశోక్‌నగర్ వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో తిరిగి నిరు ద్యోగులను కలిసి ఆశ పెట్టారు.
- నిలదీస్తున్న తెలంగాణ.. నేడు భారత్ సమ్మిట్‌కు రాహుల్ రాక
- ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత
- అశోక్‌నగర్‌లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్న
- జాబ్ క్యాలెండర్ అడిగితే సర్కార్ లాఠీచార్జ్
- డిక్లరేషన్లకు పాతరేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- రాహుల్ జవాబు చెప్పాలని జనం డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో ఎప్పుడంటే అప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. అర్ధరాత్రి వేళ అశోక్‌నగర్ వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో తిరిగి నిరు ద్యోగులను కలిసి ఆశ పెట్టారు. ‘రెండు లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇచ్చే భరోసా నాది’ అని మాటిచ్చారు. అక్కడి నుంచి వరంగల్ పోయి రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం అన్నారు. నాలుగు యాత్రలు, 11 బహిరంగ సభల్లో పాల్గొని ఒకో వర్గాన్ని కలిసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుందని ఊరించారు. రాహుల్ అంతటి నేత కదా! అని జనం హామీలు నమ్మి అధికారం అప్పగించారు. తీరా గద్దెనెకాక కాంగ్రెస్ పెద్దలు పత్తాలేకుండా పోయారు.
భారత్ సమ్మిట్‌కు రాక
శుక్రవారం అర్ధరాత్రి రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్నారు. నేడు హైటెక్స్‌లో జరిగే భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో ప్రసంగిస్తారు. ఇదే సందర్భంలో ఆయన గిగ్, ప్లాట్ ఫామ్ వరర్లతో సమావేశమవుతారు. ‘నాడు అర్ధరాత్రి అశోక్‌నగర్ వెళ్లి నిరుద్యోగులను పలుకరించిన రాహుల్, ఇప్పుడు అదే అర్ధరాత్రి వచ్చి కార్యక్రమాలను ముగించుకొని ఢిల్లీకి వెళ్లిపోతారా? లేక తాను ఇచ్చిన హామీల కోసం ఎదురుచూస్తున్న యువత, రైతుల మధ్యకు వెళ్లే ధైర్యం చేస్తారా? వరంగల్ రైతు డిక్లరేషన్ ఎంత వరకు అమలు అవుతున్నదని రైతులతో ముఖాముఖి మాట్లాడుతారా?’ అని తెలంగాణ రైతులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
నాడు ఎన్నెన్నో హామీలిచ్చి..
2023 అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఎనిమిది రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నాలుగు యాత్రలు, 11 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 18న రామప్ప నుంచి ప్రారంభమైన బస్సు యాత్రలో పలు జిల్లాలు చుట్టేశారు. మహిళలు, కార్మికులు, రైతులు, నిరుద్యోగులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం చివరి దశలోనూ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. నవంబర్ 25న అర్ధరాత్రి అశోక్‌నగర్‌లో నిరుద్యోగ యువతను కలిశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ పరిసరాల్లో విద్యార్థులతో మాట్లాడారు. అశోక్‌నగర్‌లో నిరుద్యోగులతో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు రాక యువత నష్టపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాదీ జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, సెప్టెంబర్ 17 నాటికి నియామకాలు పూర్తిచేస్తామని ప్రకటించారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి అందిస్తామని కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌లో పేరొన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, ప్రైవేట్ రంగంలో తెలంగాణ యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ హామీలతో యువతలో కాంగ్రెస్‌పై ఆశలు పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి కోచింగ్ తీసుకుంటున్నవారు, పరీక్షల కోసం అప్పులు చేసి హైదరాబాద్‌లో ఉంటున్నవారు కాంగ్రెస్ మాటలు నమ్మారు. అధికారంలోకి వచ్చాక రాహుల్‌గాంధీ హామీలు గాలికి పోయాయి. జాబ్ క్యాలెండర్ లేదు.. నోటిఫికేషన్లు లేవు. ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది.
నిరుద్యోగులపై ఉక్కుపాదం
జాబ్ క్యాలెండర్ , ఉద్యోగాల నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ కోరుతూ నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలపై ప్రభుత్వం పలుమార్లు పోలీసు బలగాలను ప్రయోగించి ఉక్కుపాదం మోపింది. 2024 జూలై 5న టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించిన నిరుద్యోగులను అరెస్టు చేసింది. జూలై 15న డీఎస్సీ వాయిదా, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల పెంపు కోరుతూ సచివాలయం ముట్టడికి వెళ్లిన విద్యార్థులను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నది. అదే ఏడాది అక్టోబర్ 18న గ్రూప్-1 మెయిన్స్ వాయిదా, జీవో 29 రద్దు కోరుతూ అశోక్‌నగర్‌లో నిరసన తెలిపిన అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయించగా పలువురు గాయపడ్డారు. 2025 జూలై 4న జాబ్ క్యాలెండర్ అమలు కోరుతూ చేపట్టిన చలో సచివాలయం సందర్భంగా నిరుద్యోగులను అరెస్టు చేశారు. 2026 జనవరి 7 నుంచి 12 వరకు దిల్సుఖ్నగర్, చికడపల్లి, అశోక్‌నగర్ ప్రాంతాల్లో వరుస నిరసనలు జరుగగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
జనవరి 8న అశోక్‌నగర్‌లో పోలీసుల లాఠీచార్జ్ జరిగిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. మార్చి 26న చలో అసెంబ్లీకి ముందే హాస్టళ్లు, గ్రంథాలయాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి పలువురు నిరుద్యోగులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల కోసం నిరసన తెలిపిన సందర్భాల్లో కనీసం ఆరుసార్లు పోలీసు నిర్బంధం, అరెస్టులు కొనసాగాయి. అర్ధరాత్రి వచ్చి, వెంటనే వెళ్లిపోయే పర్యటనలు తప్ప, నిరుద్యోగులు నివసించే అశోక్‌నగర్ , ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ పరిసరాలకు ఆయన రావడం లేదనే భావన యువతలో బలపడుతున్నది. నాడు అశోక్‌నగర్‌లో యువతతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్న రాహుల్.. ఇప్పుడు అదే ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తారా? ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులతో మరోసారి మాట్లాడుతారా? పోలీసు లాఠీచార్జ్‌లో దెబ్బలు తిన్న నిరుద్యోగులను పరామర్శిస్తారా? తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానని విద్యార్థులకు క్షమాపణలు చెప్తారని తెలంగాణ విద్యార్థి సంఘాల నేతలు అడుగుతున్నారు.

వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది?
2022 మే 6న వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం, కౌలు రైతులకు కూడా అదే మొత్తంలో ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం ప్రకటించారు. పంట రుణాలను రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని మాటిచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు, చెరుకు కర్మాగారాల పునరుద్ధరణ, పంటల బీమా, నకిలీ విత్తనాల నియంత్రణ వంటి అంశాలనూ డిక్లరేషన్‌లో చేర్చారు. ఈ డిక్లరేషన్‌ను 2023 ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్ విసృ్తతంగా ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. కౌలు రైతులకూ పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా మొత్తాన్ని ఎకరాకు రూ.12 వేలకు పరిమితం చేసింది. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12 వేల సాయం ప్రకటించింది. పథకం అమలులో అర్హతలపై పరిమితులు విధించింది. రైతు రుణమాఫీని అరకొరగా చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. పూర్తి మాఫీకి రూ.49,500 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం మూడు విడతల్లో కేవలం రూ.17,933 కోట్లే మాఫీ చేసింది. రుణమాఫీ ఆలస్యం, రైతు భరోసా చెల్లింపుల్లో అస్తవ్యస్తం, ఎరువుల కొరత, పంట నష్టం, కొనుగోళ్ల సమస్యలపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వరంగల్ సభలో రైతుల సమస్యలపై మాట్లాడిన రాహుల్ ఇప్పుడు వారి మధ్యకు వెళ్లి పరిస్థితిని తెలుసుకుంటారా? రైతు డిక్లరేషన్‌లో పేరొన్న రూ.15 వేల పెట్టుబడి సాయం రూ.12 వేలకు ఎందుకు పరిమితమైందని ప్రభుత్వాన్ని నిలదీస్తారా? కౌలు రైతులకు ఇచ్చిన హామీ అమలుపై సమీక్షిస్తారా? అని తెలంగాణ రైతాంగం అడుగుతున్నది.
కార్మికుల నెత్తురు తాగుతున్నరు
భారత్ సమ్మిట్‌లో భాగంగా రాహుల్ గాంధీ శనివారం గిగ్ కార్మికులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నట్టు ప్రభుత్వం చెప్తున్నది. ఆన్లైన్ డెలివరీ సంస్థలు, క్యాబ్ సేవలు, ఇతర డిజిటల్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా పనిచేస్తున్న వీరికి ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, ఆరోగ్య రక్షణ, సామాజిక భద్రత కల్పించాలనే డిమాండ్లు ఉన్నాయి. గిగ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం 2026లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. శాసనసభ ఆమోదం పొందిన ఈ చట్టం కార్మికుల నమోదు, సంక్షేమ బోర్డు, సామాజిక భద్రత, ఫిర్యాదుల పరిషారానికి చట్టబద్ధమైన వ్యవస్థను కల్పిస్తున్నది. అయితే చట్టం తీసుకురావడంతోనే కార్మికుల సమస్యలు పరిషారమైనట్టు కాదని, నిబంధనలు, బోర్డు ఏర్పాటు, నమోదు, సంక్షేమ నిధి, ప్రయోజనాల పంపిణీ వంటి అంశాలు క్షేత్రస్థాయిలో అమలు కావాల్సి ఉన్నదని కార్మిక సంఘాలు పేరొంటున్నాయి. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కార్మికులకు ఇప్పటివరకు అందిన ప్రయోజనాలెన్ని? ఎంతమందిని నమోదు చేశారు? ప్రమాద బీమా, వైద్య సాయం, సంక్షేమ నిధి ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేంది? భవన కార్మికుల సంక్షేమ బోర్డు మీద పడి కార్మిక సొమ్మును దిగమింగుతున్న బాగోతంపై ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ స్పష్టత కోరుతారా? అని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అర్ధరాత్రి వచ్చి, కార్యక్రమాలు ముగించుకొని తిరిగి ఢిల్లీకి వెళ్లిపోవడం కంటే తెలంగాణ ప్రజలకు కొంత సమయం కేటాయించాలని, గిగ్ కార్మికుల సమావేశంతో పాటు నిరుద్యోగులు, రైతులను కలిసి మాట్లాడాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇవి నిరుద్యోగుల ప్రశ్నలు
నాడు అర్ధరాత్రి అశోక్‌నగర్ వెళ్లి నిరుద్యోగులను పలుకరించిన రాహుల్.. ఇప్పుడు అదే అర్ధరాత్రి వచ్చి కార్యక్రమాలను ముగించుకొని ఢిల్లీకి వెళ్లిపోతారా? మళ్లీ అదే అశోక్‌నగర్‌లో యువతతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుంటారా? పోలీసు లాఠీచార్జ్‌లో దెబ్బలు తిన్న నిరుద్యోగులను పరామర్శిస్తారా? తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానని విద్యార్థులకు క్షమాపణలు చెప్తారా?
ఇవి రైతుల ప్రశ్నలు
ఎన్నికల సమయంలో వరంగల్ రైతు సంఘర్షణ సభలో రైతు సమస్యలపై మాట్లాడిన రాహుల్.. ఇప్పుడు వారి మధ్యకు వెళ్లి వారి దుస్థితిని తెలుసుకుంటారా? రైతు డిక్లరేషన్‌లో పేరొన్న రూ.15 వేల పెట్టుబడి సాయం రూ.12 వేలకు ఎందుకు పరిమితమైందని ప్రభుత్వాన్ని నిలదీస్తారా? కౌలు రైతులకు ఇచ్చిన హామీ అమలుపై సమీక్షిస్తారా?
ఇవి కార్మికుల ప్రశ్నలు
గిగ్ వర్కర్ల కోసం చట్టం తెచ్చిన తర్వాత కార్మికులకు అందిన ప్రయోజనాలెన్ని? ఎంతమందిని నమోదు చేశారు? ప్రమాద బీమా, వైద్య సాయం, సంక్షేమ నిధి ఏర్పాటుపై తీసుకున్న చర్యలేంది? భవన కార్మికుల సంక్షేమ బోర్డు మీద పడి కార్మిక సొమ్మును అప్పనంగా దిగమింగుతున్న వ్యవహారంపై ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ స్పష్టత కోరుతారా?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

