ఏపీ ప్రజలు బీఆర్ఎస్ వైపే
వైసీపీ పాలనతో తీవ్ర సంతృప్తితో ఉన్న ఏపీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ అసమర్థ పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
- జగన్ అసమర్థ పాలనకు చరమగీతం పాడాలి
- బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పిలుపు
- వైసీపీ నుంచి బీఆర్ఎస్లో పలువురు నేతల చేరిక
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): వైసీపీ పాలనతో తీవ్ర సంతృప్తితో ఉన్న ఏపీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ అసమర్థ పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఏపీ క్యాంప్ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నేతలు తోట సుబ్బారావు, జాలే వాసుదేవనాయుడు ఆధ్వర్యంలో పలు జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు తోట సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయిన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ సారధ్యంలో శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఏపీలో అందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం తమ రాష్ట్ర రాజధాని ఏదో చెప్పుకోలేని గందరగోళ పరిస్థితిలో రాష్ట్ర ప్రజానీకం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

