MLA Vemula warns | కేసీఆర్ గురించి మహేష్ కుమార్ గౌడ్ అవాక్కులు, చేవాక్కులు పేలితే జాగ్రత్త : ఎమ్మెల్యే వేముల హెచ్చరిక
MLA Vemula warns | దురదృష్టవశాత్తు తెలంగాణ ఉద్యమానికి సంబంధంలేని వాళ్లు ముఖ్యమంత్రి, పీసీసీ ప్రెసిడెంట్, ఉపముఖ్యమంత్రి అయ్యారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
నిజామాబాద్: దురదృష్టవశాత్తు తెలంగాణ ఉద్యమానికి సంబంధంలేని వాళ్లు ముఖ్యమంత్రి, పీసీసీ ప్రెసిడెంట్, ఉపముఖ్యమంత్రి అయ్యారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy ) అన్నారు.కేసీఆర్( KCR ) గురించి మహేష్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ) అవాక్కులు, చేవాక్కులు పేలితే జాగ్రత్త అని హెచ్చరించారు.

బీఆర్ఎస్ నిజామాబాద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్ష దివాస్ ( Deeksha Diwas) సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఉద్యమం చేసినా రోజు, విద్యార్థులు బలిదానమైన రోజు మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టమని వ్యాఖ్యనించారు.
కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు.2009 నవంబర్ 9న కేసీఆర్ దీక్ష ఫలితంగా కేంద్రం ప్రకటన చేసిందని గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ జాతిపిత అని, తెలంగాణ ప్రజల కోసం ప్రాణాన్ని సైతం పనంగా పెట్టిన వ్యక్తని కొనియాడారు.
15 సంవత్సరాల పాటు అన్ని పదవులు వదిలేసి స్వచ్ఛందంగా ఒక్కడిగా తెలంగాణ ఉద్యమ కోసం బయలు దేరారని అన్నారు. వేలాదిమంది విద్యార్థుల బలిదానాలకు కారణమైన సోనియాగాంధీకి పూలమాలలు ఎందుకు వేయాలో చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్‌కు డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

